డిసెంబర్ 23 (ఆంధ్రపత్రిక): అడ్వెంచరస్ మూవీ ’కార్తికేయ2’తో ప్యాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్.. ’18 పేజెస్’ లాంటి పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ అవుతోన్న సందర్భంగా నిఖిల్ అనేక విషయాలు పంచకున్నారు.18 పేజెస్ లాంటి వెరైటీ సినిమాలో నటించడం కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్. ఇదొక క్రేజీ లవ్‌స్టోరీ. లవ్‌తో పాటు థ్రిల్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. అమ్మాయిలను ఎలా రెస్పెక్ట్ చేయాలో యూత్‌కి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. కథ సింపుల్‌గా ఉన్నా, ట్విస్టులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. క్లైమాక్స్ ఎవరూ గెస్ చేయని విధంగా ఉంటుంది. సుకుమార్ గారి కథలో నటించడం హ్యాపీ. ఆయన మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. నందిని పాత్రలో అనుపమ బెస్ట్ ఇచ్చింది. మేమిద్దరం బెస్ట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంటాం. ఆమెతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంటుంది. ’కార్తికేయ2’ సక్సెస్ తర్వాత కొన్ని సీన్స్ ఇంప్రవైజ్ చేయడానికి రీ షూట్ చేశాం. ఇతర భాషల్లో డబ్బింగ్‌కి ప్లాన్ చేయలేదు. తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నాం. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌గా వస్తున్నాం. సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ఇక కొత్త సినిమాల సెలెక్షన్లో ఆచితూచి అడుగులేస్తున్నా. ప్రస్తుతం ’స్పై’ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాను. ’కార్తికేయ3’ వచ్చే ఏడాది చివర్లో మొదలవుతుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!