న్యూఢల్లీి,డిసెంబర్ 23 (ఆంధ్రపత్రిక): పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. షెడ్యూల్‌కు ఆరు రోజుల ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.ఈసారి మొత్తం 13 రోజులపాటు సభ కొనసాగగా.. 97 శాతం మెరుగైన పనితీరు సాధించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తన ముగింపు ప్రసంగంలో వెల్లడిరచారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. ఈ దఫా సమావేశాల్లో ప్రధానంగా చైనా సరిహద్దు అంశంపై చర్చించాలని విపక్ష పార్టీలు పట్టుబడిన సంగతి తెలిసిందే.డిసెంబర్ 7న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలను డిసెంబర్ 29వరకు కొనసాగించాలని తొలుత నిర్ణయించారు. అయితే, పండగలు, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని సమావేశాలను త్వరగా ముగించాలని సభ్యుల నుంచి ప్రభుత్వానికి, ఉభయ సభల ప్రిసైడిరగ్ అధికారులకు విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఆరు రోజుల ముందు ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి.శీతాకాల సమావేశాలు మొదలైన రెండు రోజులకే అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం బయటకు వచ్చింది. ఈ అంశంపై చర్చ జరపాలని విపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీనిపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని యాంగ్స్తే ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద యథాతథస్థితిని మార్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించిందని తెలిపారు.శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ 102 శాతం పనితీరు కనబర్చిందని ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ వెల్లడిరచారు. 13 రోజులపాటు కొనసాగిన ఈ సమావేశాల్లో 64 గంటల 50ని.లు సభ సాగిందన్నారు. సభలో విపక్ష సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. వారి తీరు వల్ల ఒక గంట 45ని.ల విలువైన సమయం వృథా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!