రాబోయే 3 నెలల్లో చైనాలో 60% మందికి కొవిడ్..!
- చైనాలో ప్రస్తుతం మరణాలు కూడా ఎక్కువగానే ఉంది
- బీజింగ్‌లోనే రోజుల వ్యవధిలో 2700 మంది చనిపోయినట్లు వెల్లడి
- బీజింగ్‌లోని కొన్ని శ్మశానవాటికలు కొవిడ్ మృతులతో నిండిపోయాయి
చైనా,డిసెంబర్ 20 : చైనాలో ‘జీరో-కొవిడ్’ నిబంధనలను సడలించిన తర్వాత నుంచి కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది.ప్రస్తుతం అక్కడ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. వైరస్ బాధితులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయయాని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డిరగ్ వెల్లడిరచారు. అంతేగాక, వచ్చే మూడు నెలల్లో ఆ దేశంలో 60శాతం మందికి పైగా వైరస్ బారిన పడతారని నిపుణులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ‘’ఆంక్షలు సడలించిన తర్వాత చైనాలో ఆసుపత్రులు కొవిడ్ బాధితులతో కిక్కిరిసిపోయాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలో 60శాతం మందికి పైగా, ప్రపంచ జనాభాలో 10శాతానికి పైగా కరోనా బారిన పడే ప్రమాదముందని అంటువ్యాధుల నిపుణులు అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది చోటుచేసుకునే అవకాశముంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని ఎరిక్ ఓ ట్వీట్ చేశారు. చైనాలో రోగులతో నిండిపోయిన ఓ ఆసుపత్రి దృశ్యాలను కూడా ఆయన షేర్ చేశారు. చైనాలో ప్రస్తుతం మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నప్పటికీ.. అధికారిక సంఖ్య మాత్రం బయటకు రావట్లేదని తెలిపారు. కొవిడ్ మహమ్మారి నుంచి యావత్ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ.. ఎరిక్ ట్వీట్ భయాందోళనలు రేపుతోంది.ప్రజాందోళనలు వెల్లువెత్తడంతో బీజింగ్సర్కారు ఇటీవల ‘జీరో-కొవిడ్’ నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే. నాటి నుంచి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నాలుగు నెలల తర్వాత అక్కడ మరణాలు కూడా నమోదవుతున్నాయి. బీజింగ్‌లో రెండు మరణాలు నమోదైనట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. అయితే, ఈ మరణాల లెక్క అధికారికంగా ప్రకటించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్‌లోనే రోజుల వ్యవధిలో 2700 మంది చనిపోయినట్లు హాంకాంగ్ మీడియా వర్గాలు వెల్లడిరచాయి. బీజింగ్‌లోని కొన్ని శ్మశానవాటికలు కొవిడ్ మృతులతో నిండిపోయాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. రోజుకు సగటున 200 మృతదేహాలు వస్తున్నట్లు ఆ శ్మశానవాటికలో పనిచేసే ఓ సిబ్బంది చెప్పారని ఆ కథనం వెల్లడిరచింది. ఇక ఫార్మా దుకాణాల్లో మందుల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.అధికారిక లెక్కల ప్రకారం.. చైనాలో ఇప్పటివరకు 5,327 మంది కొవిడ్‌తో మరణించారు. ఆ దేశంలో ఎవరైనా కేవలం కరోనా వల్ల చనిపోయినప్పుడే కొవిడ్ మరణంగా గుర్తిస్తారు. చాలామేర ఇతర దేశాల్లో మాత్రం కరోనా వైరస్ సోకి ఆ ప్రభావంతో ఇతర ఏ కారణాలతో మృతిచెందినా కొవిడ్ మరణాలుగానే లెక్కిస్తున్నారు. దీంతో ఆయా దేశాల్లో కొవిడ్ మరణాల సంఖ్య తీవ్రంగా ఉన్నప్పటికీ.. వాటితో పోలిస్తే చైనాలో గుర్తించిన కొవిడ్ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మరోవైపు, జీరో కొవిడ్‌ను సడలించిన తర్వాత లక్షణాలు లేని కొవిడ్ కేసులను బీజింగ్ ప్రకటించడంలేదు. అలాగే స్వల్ప లక్షణాలున్న వారిని కూడా నిర్బంధంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించకుండా ఇళ్లలో ఉండాలని సూచిస్తున్నారు.