మోడరేట్ కేటగిరి నుంచి వెరీ పూర్ కేటగిరి
- తీవ్రంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు..పెరిగిన చలి తీవ్రత
- ఒక వైపు పొల్యూషన్ మరోవైపు చలితో ఢల్లీి వాసులు తీవ్ర ఇబ్బందులు
- ఎయిర్ పొల్యూషన్‌తో శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
న్యూఢల్లీి,డిసెంబర్ 19 (ఆంధ్రపత్రిక) : ఢల్లీిలోవాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. మోడరేట్ కేటగిరి నుంచి వెరీ పూర్ కేటగిరికి దిగజారింది. గత రెండు రోజుల నుంచి ఎయిర్ క్వాలిటీ మోడరేట్ కేటగిరిలో ఉండగా.. ఇవాళ వెరీ పూర్ కేటగిరికి చేరింది. మరో వైపు ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. ఒక వైపు పొల్యూషన్ మరోవైపు చలితో ఢల్లీి వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పోల్యూషన్‌తో పాటు, చలి కారణంగా సీజనల్ వ్యాధుల బారీన పడుతున్నట్లు ఢల్లీి ప్రజలు చెబుతున్నారు. ఎయిర్ పొల్యూషన్‌తో శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలుపుతున్నారు. పిల్లల్ని బయటకు పంపించాలంటేనే భయమేస్తుందని.. పిల్లలు, వృద్ధులు లంగ్స్ ప్ల్రాబెమ్స్‌తో చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.