దోషుల విడుదలపై రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
న్యూఢల్లీి,డిసెంబర్ 17 (ఆంధ్రపత్రిక): బిల్కిస్‌బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం
శనివారం కొట్టివేసింది. ఈమేరకు అజరు రస్తోగి, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్‌బానోపై అత్యాచారం చేసిన నిందితులను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిందితుల విడుదలకు వ్యతిరేకంగా ఆమె రివ్యూ పిటిషన్ వేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 432 (7) (బి) ప్రకారం సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం గమనార్హం. కాగా, 2002 మార్చి 3న అహ్మదాబాద్ సవిూపంలోని ఒక గ్రామంలో అప్పటి 19 ఏళ్ల బానోపై 11 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె మూడేళ్ల కుమార్తెతో సహా 14 మంది సభ్యులు కూడా మృతి చెందారు. ఈ అత్యాచార నిందితుల్ని గుజరాత్ ప్రభుత్వం రిమిటేషన్పై ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేసింది. నిందితుల విడుదలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. తనకు జరిగిన అన్యాయంపై ఆమె మరోసారి పిటిషన్ దాఖలు చేసింది.