రేజర్‌పే, క్యాష్‌ఫ్రీకి ఆర్బీఐ ఆదేశాలు
న్యూఢల్లీి,డిసెంబర్ 16 (ఆంధ్రపత్రిక): పేమెంట్ సంస్థలైన రేజర్ పే , క్యాష్ ఫ్రీ సంస్థలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.రెండు సంస్థలూ తాత్కాలికంగా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని సూచించింది. ఆన్లైన్ చెల్లింపు ప్రాసెసింగ్‌లో పాల్గొన్న సంస్థలకు చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్‌ను ఆర్బీఐ జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే రేజర్‌పే, క్యాష్ ఫ్రీ సంస్థలకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. దీనిపై రేజర్‌పే స్పందించగా.. క్యాష్ ఫ్రీ మాత్రం తన స్పందన తెలియజేయలేదు.పేమెంట్ అగ్రిగేటర్, పేమెంట్ గేట్‌వే లైసెన్స్‌కు సంబంధించి జులైలోనే ఆర్బీఐ నుంచి తమకు సూత్రప్రాయ అనుమతి లభించిందని రేజర్ పే తెలిపింది. అయితే, లైసెన్సు ప్రక్రియలో భాగంగా అదనపు సమాచారం ఆర్బీఐ కోరిందన్నారు. అప్పటి వరకు కొత్త వినియోగదారుల్ని చేర్చుకోవద్దని మాత్రమే తమకు ఆర్బీఐ సూచించిందని రేజర్ పే ప్రతినిధి తెలిపారు. దీనివల్ల ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలపై గానీ, వ్యాపారులపై గానీ ఎలాంటి ప్రభావం ఉండబోదని చెప్పారు.