గడపగడపకు చొచ్చుకు పోవాల్సిందే
రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్లోకి వెళ్లాలి
మార్చి నాటికి పూర్తి చేయాల్సిందే
సరిగా పనిచేయని నేతలకు క్లాస్
32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ సవిూక్ష
అమరావతి,డిసెంబర్ 16 (ఆంధ్రపత్రిక): గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తి చేయాలని సిఎం జగన్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. 32 మంది ఎమ్మెల్యేలు తక్కువ రోజులు పాల్గన్నారని, రానున్న రోజుల్లో వారు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎవరూ అలక్ష్యం చేయొద్దు. మార్చి నాటికి పూర్తిస్థాయి నివేదికలు తెప్పిస్తానని సీఎం అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించి.. ఆశిస్సులు కోరేందుకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సవిూక్ష నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నియోజక వర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో`ఆర్డినేటర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, కాగా, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మే 11న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ప్రారంభించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం చేసిన మేలును అక్కా చెల్లెమ్మలకు వివరించడానికి ఇంటింటికి వెళుతున్న ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు గడపగడపలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును సవిూక్షించి, ఎమ్మెల్యేలు, సమన్వ యకర్తల అభిప్రాయాలను తెలుసుకుని ఆ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రతినెలా సీఎం వైఎస్ జగన్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పనితీరు మెరుగుపడని నేతలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి లోపు పనితీరు మెరుగుపరుచుకోవలని సూచించారు. ప్రజల ఆశీస్సులు కోరేందుకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సవిూక్ష నిర్వహించారు. పార్టీలో ఇంటర్నల్ రిపోర్టును వారి ముందుంచారు. మొత్తం 32 మంది నేతల పనితీరు బాగోలేదని సూచించారు. పార్టీ కోసం తక్కువ సమయం కేటాయిస్తు న్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి విూటింగ్ మార్చిలో ఉంటుందని.. అప్పటి వరకు పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. పెన్షన్ పెంపు కార్యక్రమం పెద్ద యెత్తున చెయ్యాలన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి పెన్షన్ పెంపు వివరించాలన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించాలన్నారు. అయితే, పనితీరు మెరుగుపరుచుకోని నేతల పేర్లను సమావేశంలో సీఎం జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో మంత్రులు అప్పలరాజు, రజిని, అమర్నాథ్ రెడ్డి,బొత్స సత్యనారాయణ,అంబటి రాంబాబు, మంత్రి గుమ్మనూరు జయరాం ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇక్బాల్, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. నిడదవోలు, కందుకూరు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరించడమే టార్గెట్‌గా సీఎం జగన్ ఆదేశాల మేరకు మే 11న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ప్రారంభించారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును సవిూక్షించి, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల అభిప్రాయాలను తెలుసుకుని ఆ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడమే టార్గెట్‌గా ప్రతినెలా సీఎం వైఎస్ జగన్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలు, వైసీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్డినేటర్లు తదితరులు హాజరయ్యారు.