బెంచ్ నుంచి వైదొలిగిన న్యాయమూర్తి
న్యూఢల్లీి,డిసెంబర్ 13 : బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేసిన అంశం సుప్రీం కోర్టులో విచారణకు వస్తోన్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసు విచారణ చేపట్టనున్న న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ బేలా ఎం.త్రివేదీ ధర్మాసనం నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి తెలియజేశారు. అయితే.. జస్టిస్ బేలా ఎం.త్రివేది వైదొలగడానికి గల కారణాలను మాత్రం వెల్లడిరచలేదు. దీంతో నేడు జరగనున్న ఈ కేసు విచారణ వాయిదా పడిరది.2002లో గోధ్రా అనంతర అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన కేసులో దోషులుగా ఉన్న11మంది ఇటీవల జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతోపాటు రాజకీయ పార్టీలు కూడా దీనిని ఖండిరచాయి. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు కు చేరింది. ఆ ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ మహిళా హక్కుల కార్యకర్తలు కూడా పిటిషన్ వేశారు. దోషులకు రెమిషన్ మంజూరు వెనక ఉన్న నిబంధనలను మాత్రమే తాము సవాలు చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు సుప్రీం అంగీకరించి