పోలవరం నిధులను తక్షణమే విడుదల చేయాలి
- ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని చెప్పారు
- భూసేకరణ చట్టం కింద నష్టపరిహారాన్ని నేరుగా రైతులు ఖాతాల్లో వేయాలి
- తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాలి
- జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచాలి
- లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి వివరణ
న్యూఢల్లీి,డిసెంబర్13 : లోక్‌సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం నిధులను తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి కోరారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. జాతీయ ప్రాజెక్టులా దాన్ని ముందుకు తీసుకువెళ్లడం లేదు. భూ సేకరణ చట్టం వల్ల అంచనా వ్యయం పెరిగింది. 55,548 కోట్ల రూపాయల సవరించిన అంచనా వేయానికి కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటివరకు కేంద్ర ఆర్థిక శాఖ దీనిపై ఆమోదం తెలపకుండా పెండిరగ్లో ఉంచింది. ఇరిగేషన్ కాంపోనెంట్, డ్రిరకింగ్ కాంపోనెంట్ అనే పేరుతో ప్రాజెక్టు నిధులకు కత్తెర పెడుతున్నారు. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టుకు లేని కొత్త కొత్త షరతులు పెట్టి నిధులను తగ్గిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని వెంటనే తొలగించాలి. భూసేకరణ చట్టం కింద నష్టపరిహారాన్ని నేరుగా రైతులు ఖాతాల్లో వేయాలి. జాతీయ ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మిస్ హ్యాండిల్ చేస్తుంది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాలి. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం, పట్టణ ప్రాంతాల్లో 40 శాతం మంది ప్రజలకి ఇవ్వడం పక్షపాతం చూపడమే. దీని కారణంగా 56 లక్షల మంది లబ్ధిదారులు నష్టపోతున్నారు. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. విభజన వల్ల ఏపీ తలసరి ఆదాయం 8,979కి తగ్గిపోయింది. ఏపీకి 56% జనాభా వస్తే 45% ఆదాయం మాత్రమే దక్కింది. 60% అప్పులు మాపై మోపారు. ఈ నష్టం కారణంగానే మాకు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గంలో దీన్ని పాస్ చేసిన ఇప్పటివరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. వందలసార్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో అడిగిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.