కుమార్తెతో కలసి యాత్రలో ప్రియాంక
జయపుర,డిసెంబర్ 12 : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. రాజస్థాన్ లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్రకు ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె మిరయా వాద్రాలో కలిసి ఆమె జోడో యాత్రలో పాల్గొన్నారు. జోడో యాత్రకు ఘన స్వాగతం పలికి.. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. ప్రజలు, అభిమానులకు అభివాదం తెలిపారు. అంతకుముందు.. మహిళా సశక్తికరణ్ దివస్ సందర్భంగా రాహుల్ గాంధీ మహిళలతో కలిసి భారత్ జోడో యాత్రను కొనసాగించారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా పీపుల్వాడలో మహిళలతో కలిసి ఆయన నడిచారు. యాత్రలో మహిళా మద్దతుదారులు సాంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించి, రాహుల్ గాంధీ సుదీర్ఘ జీవితానికి అంకితమైన జానపద పాటలను పాడారు. రaలావర్, కోట, బుండి, సవాయి మాధోపూర్, దౌసా, అల్వార్ జిల్లాల విూదుగా రాహుల్ జోడో యాత్ర సాగనుంది. డిసెంబర్ 21న హర్యానాలో ప్రవేశించనుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన రాహుల్ యాత్ర.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల విూదుగా తమిళనాడు, కేరళ, ఆంధప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలను కవర్ చేసింది. ఇక 2023 ఫిబ్రవరి నెలతో జమ్మూకాశ్మీర్ చేరుకున్న తర్వాత రాహుల్ జోడో యాత్ర ముగియనుంది.