అహ్మదాబాద్,డిసెంబర్ 10 : గుజరాత్సీఎం బాధ్యతలను భాజపా వరుసగా రెండోసారి భూపేంద్ర పటేల్‌కే అప్పగించనుంది.ఈ మేరకు అహ్మదాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా ఎంపికైన పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశమై ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అర్జున్‌ముండా కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప హాజరయ్యారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశమివ్వాలని కోరారు.సీఏంగా బాధ్యతలు చేపట్టనున్న భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో 1.92 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2017 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. అధిష్ఠానం ఆదేశాల మేరకు గత ఏడాది సెప్టెంబరులో విజయ్ రూపాని స్థానంలో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో 156 స్థానాల్లో గెలుపొంది.. అఖండ విజయం సాధించిన భాజపా..మృదు స్వభావి అయిన భూపేంద్రుడికే మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు సీఎంగా భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు భాజపా వెల్లడిరచింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని పేర్కొంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!