మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, డిసెంబర్ 10 (ఆంధ్రపత్రిక):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం బదిలీల ప్రక్రియ చేపట్టనుంది.3-10 తరగతులకు 7,928 సబ్జెక్టు టీచర్లు అదనంగా అవసరమని విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం హెడ్మాస్టర్ గ్రేడ్-2 సహా టీజీటీల బదిలీల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు బదిలీల ప్రక్రియ కారణంగా 2022-23 విద్యా సంవత్సరం ఒడిదొడుకులకు లోనుకాకుండా చూడా లని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది.డిసెంబరు 12 నుంచి జనవరి 12వ తేదీ వరకూ నెలరోజుల పాటు ఈ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జెడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లోని గ్రేడ్-2 హెడ్ మాస్టర్ల సర్వీసు కనీసం 5ఏళ్లు ఉండాలని ప్రభు త్వం నిబంధనల్లో పేర్కొంది. ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని ప్రభుత్వం వెల్లడిరచింది. బదిలీల ప్రక్రియను ఆన్లైన్ దరఖాస్తు, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.