హైదరాబాద్, డిసెంబర్ 9 (ఆంధ్రపత్రిక): భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన సైనికులు కలిసి భారతదేశ తలరాతను మార్చేందుకు నడుం బిగించారు. తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భారత రాష్ట్ర సమితి జెండాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేడీఎస్ చీఫ్ కుమార స్వామి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, ఆయా రాష్టాల్రకు చెందిన రైతు సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తదితరులు పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించిన సమయంలో తెలంగాణ భవన్ పటాకులు, డప్పులతో దద్ధరిల్లిపోయింది. జై కేసీఆర్, జై భారత్ నినాదాలు మార్మోగాయి. జెండా ఆవిష్కరణ కంటే ముందు బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం చేశారు. అంతకు ముందు ముందు భవన్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శృంగేరీ వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు కేసీఆర్. అలాగే అంతకంటే ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సరిగ్గా మధ్యాహ్నం 1.20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధరించారు. ’తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకొన్నామో.. అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు కదులుదాం’ అని సీఎం కేసీఆర్ దసరా రోజు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ’మన పార్టీ పేరు ఇకపై భారత రాష్ట్ర సమితి’ అని నాడు ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. పేరు మార్పును ఆమోదిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు గురువారం లేఖ రాసింది. దీంతో టీఆర్ఎస్ నేటి నుంచి బీఆర్ఎస్గా అవతరించింది. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఆర్.. నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ను గుర్తిస్తూ ఈసీ పంపిన లేఖపై మధ్యాహ్నం 1.20 నిమిషాలకు సంతకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం నేతలందరికీ ప్రగతి భవన్ లో విందు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణలుతో తెలంగాణ భవన్ సందడిగా మారింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!