డిసెంబర్ 09 (ఆధ్రపత్రిక): ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ’అవతార్`2’. 2009లో వచ్చిన ’అవతార్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ఫిదా కాని ప్రేక్షకుడు లేడు. పండోరా అనే కొత్త గ్రహాన్ని సృష్టించి, ఆ లోకంలోకి మనల్ని కూడా తీసుకెళ్ళాడు. కలెక్షన్ల పరంగానే కాదు అవార్డుల పరంగా కూడా ఈ చిత్రం సంచలనం సృష్టించింది. దాదాపు 13ఏళ్ళ తర్వాత అవతార్`2 తెరకెక్కింది. జేమ్స్ కామెరూన్ ఈ సినిమా సీక్వెల్‌ను సముద్రగర్భంలో ఆవిష్కరించాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టించింది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఇండియాలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఇండియాలో ఈ సినిమాకు రూ.10 కోట్లు వచ్చాయట. ఈ రికార్డు గతంలో డాక్టర్ స్టేర్రజ్ పేరిట ఉండేది. ఇక తాజాగా ఈ రికార్డును అవతార్ బ్రేక్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. రిలీజ్‌కు ముందే ఇలా రికార్డులు సాధిస్తే రిలీజ్ తర్వాత మరెన్నీ సంచలనాలు సృష్టిస్తుందో ప్రేక్షకులు భావిస్తున్నారు. భారీ స్థాయిలో బిజిఎస్ జరిగినట్లు తెలుస్తుంది. కొన్ని హాలీవుడ్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలంటే 2బిలియన్ డాలర్లు సాధించాల్సి ఉంటుందని టాక్. ఈ సినిమా దాదాపు 160 దేశాల్లో డిసెంబర్ 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!