సమైక్య రాష్ట్రం కోసం ఎలాంటి పోరాటమైనా చేస్తాం
ఏ వేదికనైనా పంచుకునేందుకు సిద్దం
విభజనను ముందు నుంచి వ్యతిరేకించింది తామే..
విభజన పాపానికి కాంగ్రెస్, బిజెపి, టిడిపి బాధ్యులు
ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన వ్యాఖ్యలు
అమరావతి,డిసెంబర్ 8 (ఆంధ్రపత్రిక): ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమైక్య రాష్ట్రం కోసం మరోమారు ఎలాంటి కార్యక్రమానికైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని సజ్జల అన్నారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ విధానం అని అన్నారు. ఎపి విడిపోకుండా చివరి వరకు పోరాడిరది కూడా తామేనని, జగన్ ఇందుకు చివరి వరకు కట్టుబడి ఉన్నారని అన్నారు. గురువారం నాడు విూడియాతో మాట్లాడిన సజ్జల.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తీరు, సుప్రీంకోర్టులో కేసుపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్‌పై కావాలనే ఆయన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు. అందుకోసం వచ్చిన ఏ అవకాశాన్నీ మేం వదులుకోబోమని అన్నారు. ఏ వేదిక నుంచైనా ఇకముందు తాము గట్టిగా నిబడతామని కూడా అన్నారు. సమైక్య రాష్టాన్న్రి వైసీపీనే గట్టిగా కోరుకుందని గుర్తు చేశారు. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్టాన్రికే మద్దతు ఇస్తామన్నారు. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే తమ విధానం అని సజ్జల స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ, తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుందని ప్రకటించారు. కానీ, ఇప్పుడది సాధ్యమయ్యే పనేనా అని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయని, కావాలనే సీఎం జగన్‌పై ఆయన కామెంట్స్ చేశారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇదిలాఉండగా.. బుధవారం నాడు విూడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. ఏపీ సీఎం జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. విభజన గురించి వదిలేయండని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందంటూ ఆరోపించారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ అఫడవిట్ వేశారంటూ ఫైర్ అయ్యారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడటానికి జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పోరాటం చేసే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ కోసం పోరాటం చేయకపోతే జగన్ రాజకీయ జీవితం ఇంతటితో ముగిసినట్లేనని అన్నారు. ఈ సందర్భంగా గురువారంసజ్జల విూడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పిటిషన్ ఆధారంగా తిరిగి రెండు రాష్ట్రాలు కలిపి ఉంచాలనే పరిస్ధితి సుప్రీంకోర్టులో వస్తే దాన్ని వైసీపీ స్వాగతిస్తుందన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను పునఃసవిూ క్షించాలి.. లేదా సరిదిద్దాలని కోరతామన్నారు. విభజన జరిగిన తీరుపైనే కేసు వేశారని, హావిూల అమలు కోసం కాదని.. విభజన హావిూల అమలు కోసం ఏపీ ప్రభుత్వం పోరాడుతోందని సజ్జల స్పష్టం చేశారు. రెండు రాష్టాల్రు కలిసే అవకాశాన్నీ ఏపీ సర్కార్ ఉపయోగించుకుంటుందని, ఇరు రాష్టాల్రు కలిసుండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సిందేముందన్నారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని విమర్శించారు. వారే విభజన దోషులని అన్నారు. కానీ జగన్ చివరి వరకు విభజనకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. తిరిగి రెండు రాష్ట్రాలు కలిసేదాని కోసం వైసీపీ పోరాడుతోందని మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.