మార్కెట్ అంచనాలను నిజం చేస్తూ రెపోరేటు పెంపు
రెపోరేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు గవ్నర్ ప్రకటన
మరింత భారం కానున్న రుణాల భారం
ముంబై,డిసెంబర్ 07 (ఆంధ్రపత్రిక) : రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ అంచనాలను నిజం చేస్తూ వడ్డీ రేట్లు పెంచింది. రెపోరేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 6.25శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం వరుసగా ఐదోసారి. ద్రవ్యోల్బణం కట్టడి, ఆర్థికవృద్ధి నెమ్మదించడం తదితర కారణాలతో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును కాస్త తగ్గించినట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే వడ్డీ రేట్లు పెంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ అనంతరం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిందని అన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్ప్లేషన్ రేటు 6.7 శాతంగా ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది మేలో ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆ తర్వాత జూన్, ఆగస్టు, సెప్టెంబర్ లోనూ 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపో రేటు 2019 ఏప్రిల్ నాటి గరిష్ఠానికి చేరింది. ద్రవ్య విధానాన్ని ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మూడు రోజులుగా జరుగుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య సవిూక్ష విధాన సమావేశం బుధవారంతో ముగిసింది. సమావేశం అనంతరం కొత్త ఏడాదికి ముందే సామాన్యులకు షాక్ ఇస్తూ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. రెపో రేటు వడ్డీ రేటుపై ప్రభావం చూపుతుంది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. అంతకుముందు సెప్టెంబర్ 30న సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును 5.90 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉందని ద్రవ్య సవిూక్ష విధానాన్ని ప్రకటిస్తూ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అన్నారు.రెపో రేటును 0.35 శాతం పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ బుధవారం ప్రకటించారు. ఆ తర్వాత రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. ఆర్ధిక నిపుణుల అంచనాలకు అనుగుణంగా ఆర్బీఐ రెపోరేట్లను మరో 35 బేసిస్ పాయింట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.9 శాతం)ను తదుపరి దశల్లో పెంచే విషయంలో దూకుడు ధోరణిని ప్రదర్శించవద్దని ఆర్బీఐకు పారిశ్రామిక వేదిక అసోచామ్ విజ్ఞప్తి చేసింది.రెపో రేటు పెరుగుదల బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీంతో రుణం తీసుకునే ఖర్చు పెరు గుతుంది. ఈ ప్రభావం విూరు తీసుకున్న లోన్ పై పడుతుంది. విూరు ప్రతి నెల చెల్లించే ఇఓఎ పెరుగుతుంది. రెపో రేటు పెంపు కారణంగా బ్యాంకుల రుణాల రేట్లు పెరగడం వల్ల వినియోగదారులపై ప్రభావం పడుతోంది.