మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం
మేయర్ పీఠం ఇక ఆప్ సొంతం
134 స్థానాల్లో ఆప్ ఘన విజయం
104 స్థానలకే పరిమితం అయిన బిజెపి
సత్తా చాటలేకపోయిన కాంగ్రెస్ పార్టీ
న్యూఢల్లీి,డిసెంబర్ 07 (ఆంధ్రపత్రిక): దేశరాజధాని ఢల్లీిలో ఆప్ మరోమారు బిజెపిని ఊడ్చేసింది. తనకు తిరుగులేదని చాటుకుంది. ఢల్లీి మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి చీపురుకు తిరుగులేదని నిరూపించింది. ఈ నెల 4నజరిగిన ఢల్లీి మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఇన్నాళ్లు ఢల్లీి కార్పొ రేషన్‌లో బీజేపీ హావానే సాగుతుంది. 15 ఏళ్లుగా బీజేపీనే కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఆక్రమించింది. కానీ బుధవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. తొలిసారి పూర్తిస్థాయి మద్దతుతో ఢల్లీి కార్పొరేషన్ పీఠాన్ని సొంతం చేసుకుంది. 4వ తేదీన ఢల్లీి మున్సిపల్ కార్పొరేషన్లో 250 వార్డులకు ఎలక్షన్ జరిగింది. బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ పక్రియలో ప్రారంభం నుంచి బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీనే విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ 104 స్థానా ల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలకి పరిమితం అయింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ ఆఫీస్ దగ్గర ఆప్ కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందంగా గడిపారు. 1958లో ఢల్లీి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 2012లో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేశారు. ఈ ఏడాది మే 22 నుంచి ఈ పద్ధతి అమల్లోకి వచ్చింది. ఢల్లీి మున్సిపల్ పీఠంపై గత 15 ఏళ్లుగా బీజేపీనే అధికారంలో ఉంటుంది. 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 181 స్థానాల్లో విజయం సాధించగా.. ఆప్ 48 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగు లేని విజయం కైవసం చేసుకుంది.ఢల్లీి మేయర్ పీఠాన్ని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢల్లీి మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. గత 15 ఏండ్లుగా ఢల్లీి కార్పోరేషన్‌ను ఏలుతున్న బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. వరుసగా మూడు పర్యాయాలు మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ.. ఇప్పుడు 104 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు వార్డుల్లో మాత్రమే గెలిచి, మూడు వార్డుల్లో ఆధిక్యంలో కొనసా గుతున్నది. స్వతంత్ర అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. ఢల్లీి నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే ఆప్‌ను గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో కేజ్రివాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఢల్లీిలో తమ ప్రభుత్వమే ఉన్నా, ఢల్లీి కార్పోరేషన్ బీజేపీ చేతిలో ఉండటంతో తమకు ఢల్లీిని క్లీన్ చేసే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఢల్లీి ఓటర్లకు వివరించారు. ఎప్పుడైనా ఢల్లీి పీఠంపై ఒక పార్టీ ఉంటే, ఢల్లీి మేయర్ పీఠంపై మరో పార్టీ ఉంటూ వస్తున్నాయని, దాంతో సమన్వయం కొరవడి పారిశుద్ధ్యం పడకేస్తున్నదని ఆయన చెప్పారు. ఈసారి పాత సంప్రదాయాన్ని తిరగరాసి ఢల్లీి మేయర్ పీఠాన్ని కూడా ఆప్కే కట్టబెట్టాలని కోరారు. కేజ్రివాల్ కోరినట్టుగానే ఢల్లీి ఓటర్లు ఇప్పుడు ఆప్‌కు అధికారం కట్టబెట్టారు.