అమరరాజా సంస్థ కంటే.. ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం
- తెలంగాణలో పెట్టుబడి పెడితే ఏపీ నుంచి వెళ్లగొట్టినట్టా
- వైకాపా వేధిస్తే చంద్రబాబు హెరిటేజ్ ఎలా నడుపుతున్నారు?
- అమరరాజా గ్రూప్ ఏపీలో కాకుండా ఇంకెక్కడా పెట్టుబడులు పెట్టకూడదా?
- జగన్ నాయకత్వంలో ఏ పరిశ్రమనూ రాజకీయ కోణంలో చూడలేదు
- 11.43 శాతం జీడీపీతో దేశం కంటే మన రాష్ట్రమే ముందుంది
- పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం,డిసెంబర్ 3 (ఆంధ్రపత్రిక): అమరరాజా గ్రూప్ ఏపీలో కాకుండా ఇంకెక్కడా పెట్టుబడులు పెట్టకూడదా? అని పరిశ్రమల శాఖ మంత్రి గుడి వాడ అమర్నాథ్ ప్రశ్నించారు.తెలంగాణలో పెట్టుబడి పెడితే ఏపీ నుంచి వెళ్లగొట్టినట్టా అని వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారమే అమరరాజా సంస్థకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల పరిశ్రమలు ఉండ కూడదని చూస్తే చంద్రబాబు హెరిటేజ్ సంస్థ నడిచేదా? అని ప్రశ్నించారు. జగన్ నాయకత్వంలో ఏ పరిశ్రమనూ రాజకీయ కోణంలో చూడలేద న్నారు.‘’రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అమరరాజా గ్రూపు సంస్థలకు సంబంధించిన ఎవరైనా చెప్పారా? 2010లో అమరరాజా సంస్థకు 483 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. 2019లో నోటీసు ఇచ్చే సమయానికి 252 ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. కేవలం 232 ఎకరాల్లో మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించారు. అందులో కూడా పొల్యూషన్ నిబంధనలు పాటించలేదు. అమరరాజా సంస్థలో పనిచేస్తున్న కార్మికుల బ్లడ్ శాంపిల్స్‌లో లెడ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అమరరాజా సంస్థ కంటే.. ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం. అందుకే అన్ని అంశాలపై నోటీసు ఇచ్చాం. నోటీసుపై హైకోర్టుకు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండిరగ్లో ఉంది. 11.43 శాతం జీడీపీతో దేశం కంటే మన రాష్ట్రమే ముందుంది. పెట్టుబడులు ఏవిధంగా తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే.. ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో భారీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం’’ అని మంత్రి అమర్నాథ్ వెల్లడిరచారు.