అమరావతి, డిసెంబర్ 1 (ఆంధ్రపత్రిక): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్యశ్రీ, నాడు-నేడు కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు.అయితే, అక్టోబరు 21న ప్రారంభించిన ఫ్యామిలీ డ్యాక్టర్ కాన్సెప్ట్ పైలెట్ ప్రాజెక్టు అమలుపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు అమలుకోసం తీసుకుంటున్న చర్యలను, పైలెట్ ప్రాజెక్టు అమలులో గుర్తించిన అంశాలను అధికారులు వివరించారు.ఈ క్రమంలో అధికారులు.. 26 జిల్లాల్లో నెలరోజుల వ్యవధిలో 7,166 విలేజ్ క్లినిక్స్‌లలో రెండుసార్లు చొప్పున, 2,866 విలేజ్ క్లినిక్స్‌లలో ఒకసారి చొప్పున ఫ్యామిలీ డాక్టర్ 104 వాహనంతో పాటు వెళ్లారని తెలిపారు. డిసెంబర్లో అదనంగా మరో 260.. 104 వాహనాలు సమకూర్చుకుంటున్నట్టు అధికారులు వెల్లడిరచారు. దీంతో పూర్తిస్థాయిలో 104 వాహనాలు అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వల్ల వైద్య సిబ్బందిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం, సమర్థత గణనీయంగా పెరిగాయన్నారు.సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలు, గర్భవతుల ఆరోగ్యంపైన కూడా పరిశీలన చేస్తున్నామన్న అధికారులు తెలిపారు. ఎనీమియాతో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నెలరోజుల వ్యవధిలో 7,86,226 మందికి సేవలందించామని వెల్లడిరచారు. హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్న 1,78,387 మందిని, 1,25,948 మంది మధుమేహంతో బాధపడుతున్నారని గుర్తించినట్టు తెలిపారు. వీరికి వైద్యసాయం అందించినట్టు స్పష్టం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జీ ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జి నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీంద్రప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వి వినోద్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవి శంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!