తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
ఏలూరు,నవంబర్30(ఆంధ్రపత్రిక): ప్రజల కోసం పోరాడుతున్న నన్నూ లోకేష్‌ని కూడా చంపేస్తామని వైసీపీ నేతలు అంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపిలో వైసిపి అరాచకాలు పెరిగాయని అన్నారు. బాబాయ్‌ని చంపినంత సులువుగా నన్నూ చంపొచ్చ నుకుంటున్నారని, ఇప్పుడు లోకేష్‌ని లక్ష్యంగా చేసుకున్నారట.. తాటాకు చప్పుళ్లకు భయపడమని చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌కు పోలీసులుంటే… తనకు ప్రజలు ఉన్నారన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులోని పెదవేగి మండలం విజయరాయిలో చంద్రబాబు ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా విజయరాయిలో పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించారు. ఈ సందర్బంగా బాబు మాట్లాడుతూ జగన్‌రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు.. ఎందుకు చంపారో సీఎం జగన్ చెప్పాలన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. బెదిరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ విూటింగ్‌లకు రావొద్దని ప్రజల్ని బెదిరిస్తున్నారని.. ప్రజల్లో చైతన్యం రావాలని.. ధైర్యంగా ముందుకు రావాలని పిలుపిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే డబ్బులిస్తోందని.. అయినా నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కోతలతో విద్యా దీవెన అమలు చేస్తున్నారని విమర్శించారు. రివర్స్ టెండర్ అంటూ పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ఎక్కడుందో చెప్పే పరిస్థితి లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు నేటికీ పునరావాసం లేదన్నారు. గోదావరి జిల్లాల్లో పంట విరామం ప్రకటించే దుస్థితి తెచ్చారని, రాష్ట్రంలో రైతుల నెత్తిన రూ.2.75 లక్షల తలసరి అప్పు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. లండన్ బాబుని శాశ్వతంగా లండన్ పంపిస్తా.. ఎవరితో పెట్టుకుంటున్నావో మర్చిపోకు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా కేసు సుప్రీం కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టుకు వెళ్లడం జగన్‌కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. అత్యుత్తమైన ధర్మాసనం చెప్పినా సీఎం నోరు విప్పకుండా ఉన్నారంటే రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ విమర్శలు గుప్పించారు. కేంద్రాన్ని మెప్పించి పోలవరంకి అన్ని అనుమతులు తీసుకువస్తే.. జగన్ సీఎం అయ్యాక రివర్స్ టెండర్ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేసారంటూ ఆరోపించారు. కొత్తగా వచ్చిన మంత్రికి డయాఫ్రమ్ వాల్ ఎక్కడ వుంటుందో తెలీదంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేశాం.. పోలవరం పూర్తి చేయలేక పోవడం రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ వ్యాఖ్యానించారు. జగన్‌కు పోలీసుల ఉంటే తనకు ప్రజల మద్దతు ఉందని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ విూద ఆయన పాలన విూద విమర్శలు గుప్పించారు. బాబాయ్‌ని గొడ్డలి పోటుతో చంపి గుండె పోటుగా ప్రచారం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. ఆ కేసు ఏపీ నుంచి తెలంగాణాకు ఎలా తరలిపోయిందో జగన్ నోరు విప్పి చెప్పగలరా అని చంద్రబాబు నిలదీశారు. అప్పట్లో కోడి కత్తి డ్రామాను ఆడారని రాజకీయాల కోసం ఏమైనా చేస్తారని ఆయన నిందించారు. ఈ రోజున ఏపీలో పోలీసుల మెడ విూద కత్తి పెట్టి జగన్ పనిచేయిస్తున్నారని అన్నారు. ఏపీలో ఉన్మాదుల పాలన సాగుతోందని మరోసారి వారికే అధికారం అప్పచెబితే మాత్రం ఏపీకి మిగిలేది ఏవిూ లేదని ఆయన తేల్చేశారు. ఏపీకి అమరావతి పోలవరం ఈ రెండూ శాశ్వతంగా మరచి పోవాల్సిందే అని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కి అన్ని అనుమతులు తాను కేంద్రం నుంచి సాధించుకుని వచ్చానని 72 శాతం పైగా పూర్తి చేశానని అయినా దాన్ని మూడేళ్ళుగా ఏవిూ కట్టలేక జగన్ గోదారి నట్టేట ముంచాడని బాబు మండిపడ్డారు. కొత్తగా ఆ జలవనరుల శాఖకు అమంత్రి అయిన అంబటి రాంబాబుకు డయాఫ్రం వాల్ గురించి కూడా తెలియదు అని ఆయన ఎద్దేవా చేశారు. అలా చూస్తే ఏపీకి పోలవరం పూర్తి చేయకపోవడం ఒక ఖర్మ అని ఆయన అన్నారు. ఏపీలో అభివృద్ధి లేదని అవినీతి అక్రమాలు దౌర్జన్యాలే రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని బాబు విమర్శించారు. తనకు చివరి చాన్స్ కాదని తనకు కొత్తగా చరిత్ర కూడా అవసరం లేదని కానీ రాష్టాన్రికి మాత్రం వచ్చే ఎన్నికలు చివరి చాన్స్ అని చంద్రబాబు చెప్పారు. ఆ ఎన్నికల్లో ఉన్మాదుల నుంచి పాలనను లేకుండా చేసుకుంటేనే మేలు జరుగు తుందని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. మొత్తానికి చూస్తే ఇదేమి ఖర్మ రాష్టాన్రికి అంటూ బాబు మొదలెట్టిన తొలి స్పీచ్ గోదావరి జిల్లాల్లో సంచలనంగా సాగింది. తనను తన కుటుంబాన్ని వైసీపీ టార్గెట్ చేసింది అంటూ చంద్రబాబు చెప్పిన విషయాలు జనాల్లోకి వెళ్తే మాత్రం ఏపీ రాజకీయం మారుతుంది అనే చెప్పాలి.