అన్నమయ్య,నవంబర్ 30 (ఆంధ్రపత్రిక): మా పొత్తు జనంతోనేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా మదనప్లలెలో నాలుగో విడత విద్యాదీవెన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల 6 వేల 243 మంది విద్యార్థులకు ఆర్థికసాయం అందించారు. 6 వందల 93 కోట్ల 79 లక్షల నగదును.. అర్హులైన 9 లక్షల 85 వేల 360 మంది తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. మా పొత్తు కేవలం జనంతోనే ఉంటుందని తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబులా తాను దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదని.. ప్రజల్నే నమ్ముకున్నానని తెలిపారు. గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని గుర్తుచేసిన జగన్.. తమ హయాంలో పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామన్నారు. ప్రతిపక్షాల తీరు దారుణంగా ఉందని, విపక్షాలకు ఆలోచనా శక్తి, వివేకం కొరవడిరదని మండిపడ్డారు. పెత్తందారులంతా కలిసి దుష్ప్రచారం చేస్తున్నారంటూ సీఎం జగన్ మండిపడ్డారు. అక్షరాలు రాయటం, చదవటం మాత్రమే విద్యకు పరమార్థం కాదని.. ప్రతి విద్యార్థి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వడమే విద్యకు పరమార్థం అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అన్నారని… పేదల పిల్లలు ఇంగ్లీష్‌లో చదవకూడదని వాదించే వారి మనసులు మారాలని జగన్ వ్యాఖ్యానించారు. వ్యవసాయం, విద్యను, మహిళలను దగా చేసిన చంద్రబాబు వారి గురించి మాట్లాడుతున్నాడని.. ఇలాంటి వ్యక్తి లెక్చర్ ఇస్తుంటే ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అని అంటున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు, ప్రతిపక్ష విూడియా ఛానళ్లు చేస్తున్న దుష్పచ్రారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. తనకు నీతి, నిజాయితీ ఉన్నాయని.. అందుకే ప్రతి హావిూని నెరవేరుస్తున్నానని వివరించారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి,బొత్స, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!