న్యూఢల్లీి,నవంబర్ 30 : భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక గణాంకాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల జాతీ యోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది.గతేడాది ఇదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ త్రైమాసికంతో పోలిస్తే (13.5 శాతం) సగం వృద్ధి నమోదైంది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం సంబంధిత గణాంకాలను బుధవారం వెలువరించింది.ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 5.8 శాతంగా నమోదవ్వచ్చని అంచనాలను వెలువరించింది. ఈ నెల మొదట్లో ఆర్బీఐ వెలువరించిన బులెటిన్లో సైతం వృద్ధి రేటు 6.1-6.3 శాతం మధ్య నమోదు కావొచ్చని అంచనా వేసింది. అంచనాలకు అటుఇటూగా గణాంకాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో పొరుగు దేశం చైనా వృద్ధి రేటు 3.9 శాతంగా నమోదు కావడం గమనార్హం.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!