అమరావతి,నవంబర్ 26 (ఆంధ్రపత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్ అరమణే పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన..ప్రస్తుతం రక్షణశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు గిరిధర్‌ను రిలీవ్ చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం. మరోవైపు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో గిరిధర్ అరమణే ఇవాళ భేటీ అయ్యారు. కొత్త సీఎస్ నియామకంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.ఏపీ కేడర్ సీనియార్టీ జాబితాలో గిరిధర్ అరమణే రెండో స్థానంలో ఉన్నారు. ఒకవేళ అరమణే సీఎస్‌గా బాధ్యతలు చేపడితే 2023 జూన్ 30 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. కొత్త సీఎస్ నియామకంపై ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు. డిసెంబరు 1 నుంచి నూతన ప్రధాన కార్యదర్శి బాధ్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!