అమరావతి,నవంబర్23(ఆంధ్రపత్రిక):రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీ కి హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. తాము ఎంపిక అయినప్పటికీ, మెరిట్ లిస్ట్ లో పేర్లు ఉన్నప్పటికీ పక్రియను నిలిపివేశారని మెరిట్ అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. మెరిట్ అభ్యర్ధుల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ జరిపిన ధర్మాసనం… గతంలో జరిగిన ఎంపిక పక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్ధుల జాబితాకు లైన్ క్లియర్ చేసింది. కాగా… అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని మరికొంతమంది అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్లను కొట్టివేస్తూ పాత పక్రియను కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!