జెరూసలెం,నవంబర్23 (ఆంధ్రపత్రిక):యూదుల పవిత్ర స్థలమైన జెరూసలెంలో వరుస పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఇప్పటి వరకు రెండు చోట్ల పేలుళ్లు జరగ్గా.. 14 మందికిపైగా గాయపడినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక పేర్కొంది. తొలి పేలుడు రద్దీగా ఉండే సెంట్రల్ బస్‌స్టేషన్‌లో బుధవారం ఉదయం చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఏడుగురికిపైగా గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఇజ్రాయెల్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బస్‌స్టాప్‌లో నిలిపి ఉంచిన ఓ ద్విచక్రవాహనంలో అమర్చిన బాంబు పేలినట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. ఇది ఉగ్రదాడి అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తొలి పేలుడు జరిగిన కొద్ది సేపటికే రామోట్ జంక్షన్‌లోని ఓ బస్సు వద్ద మరో పేలుడు చోటు చేసుకొంది. దీనిలో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వరుస పేలుళ్ల కారణంగా జెరూసలెంలోకి వెళ్లే రోడ్ వన్ను మూసివేశారు. టెల్ అవీవ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇజ్రాయెల్ పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఇట్మార్ బెన్ మాట్లాడుతూ ఘటనా స్థలానికి బయల్దేరానని పేర్కొన్నారు. ఈ పేలుళ్లతో ఇంతిఫాదా (తిరుగుబాటు) సమయం మళ్లీ వచ్చినట్లు అనిపిస్తోందన్నారు. కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!