- కొత్త భవనంలోనే బడ్జెట్ సమావేశాల నిర్వహణ
- కసరత్తుచేస్తున్న కేంద్ర ప్రభుత్వం
న్యూఢల్లీి,నవంబర్ 14 (ఆంధ్రపత్రిక): పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటివారంలో ఉండొచ్చునని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. పార్లమెంట్ కొత్త భవనాన్ని లాంఛనంగా ప్రారంభించి..శీతాకాల సమావేశాలు నిర్వహించాలని మోడీ సర్కార్ తొలుత భావించింది. అయితే లక్ష్యానికి అనుగుణంగా కొత్త భవన నిర్మాణ పనులు పూర్తికావటం లేదు. దాంతో ఇప్పుడున్న పార్లమెంట్ భవనంలోనే శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి 29 వరకు నిర్వహించాలని కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సాధారణంగా ప్రతిఏటా నవంబర్ 20 తర్వాత శీతాకాల సమావేశాలు నిర్వహిస్తారు. 2017, 2018లో మాత్రం సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించారు. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలు కొత్త భవ నంలోనే ఉంటాయని తెలుస్తోంది. పార్లమెంట్ సంబంధాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ సమావేశాల షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సుమారుగా రూ.1200కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవంపై మోడీ సర్కార్ సమాలోచనలు చేస్తోంది. ఈనెలాఖరులో లేదా డిసెంబర్ మొదటి వారంలో కొత్త భవనం ప్రారంభోత్సవం ఉంటుందని పీఎంవో వర్గాలు తొలుత వెల్లడిరచాయి. కొత్త భవనానికి లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం జరి పి, అందులోనే డిసెంబర్ మొదటివారంలో సమావేశాలు జరపాలని మోడీ సర్కార్ భావించింది. అయితే నిర్మాణ పనులేవీ నిర్ణీత సమ యానికి పూర్తి కాలేదు. అంతేగా క కొత్త భవనంలో పనిచేయడానికి ప్రభుత్వ అధికారులకు, ఇతర సిబ్బందికి శిక్షణ అవసరమని, దీనికి 15`20 రోజులు పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.దాదాపు 1500కు పైగా భారతీయ చట్టాలను సవరించడానికి మోడీ సర్కార్ సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో మొద లయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్ట సవరణల పక్రియ చేపడతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.