నవంబర్ 12 (ఆంధ్రపత్రిక): కథలో బలం ఉంటే ఏ చిత్రమైనా ఏ వెబ్ సిరీస్ అయినా ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ తరుణ్, సీనియర్ హీరో తనయురాలు శివాని జంటగా నటించిన అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్‌లోని గేట్ వే హోటల్లో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ తొలిసారిగా వెబ్ సిరీస్ లో నటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదని ఓటిటీ లకే ప్రాధాన్యత ఇస్తున్నారని అందుకే వెండితెర తోపాటు బుల్లితెరలో కూడా ప్రేక్షకులను అలరించేందుకు వెబ్ సిరీస్ లో నటించినట్లు తెలియజేశారు. అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్ లతో ముందుకు సాగుతుందని ఆద్యంతం కామెడీ ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. తొలిసారిగా వెబ్ సిరీస్‌లో కూడా మూడు పాటలను దర్శకుడు రూపొందించారని ఈ పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 17న జి ఫైవ్ లో అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ స్త్రీమ్మింగ్ కానుందని ప్రేక్షకులు తప్పక ఆదరించాలని హీరో రాజ్ తరుణ్ ఆకాంక్షించారు. తెలుగులో మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నానని అవి థియేటర్లోనే రిలీజ్ చేస్తామని తెలియజేశారు. అహ నా పెళ్ళంట గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని, పెళ్లి కాకుండా ఒక జంట ఒక ఇంట్లో ఎలా ఉంటారు,వారి మధ్యన జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెప్పారు. తదనంతరం హీరోయిన్ శివాని మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రేక్షకులు ఓటిటి లను ఎంతగానో ఆదరించారని తన మొదటి చిత్రం అద్భుతం కూడా ఓటిటి లోనే రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందిందని చెప్పారు. రాజ్ తరుణ్‌తో కలిసి వెబ్ సిరీస్‌లో నటించానని దర్శకుడు కథ చెప్పిన వెంటనే నచ్చడం తో నే వెబ్ సిరీస్ లో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు. మూడు సినిమాల్లో హీరోయిన్గా నటించాలని అవి త్వరలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయని ఆమె తెలియజేశారు. అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ తెలుగు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని, రెండు భాషలకు తానే డబ్బింగ్ చెప్పానని ఆమె పేర్కొన్నారు. ఈ వెబ్ సిరీస్ ని ప్రేక్షకులు ఆదరించాలని ఆమె కోరారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!