- అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
- వెంట వెళ్లిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ శుభాకాంక్షలు
- అద్వానీతో అరగంట గడిపిన మోడీ,రాజ్‌నాథ్
- దేశవ్యాప్తంగా అద్వానీకి శుభాకాంక్షల వెల్లువ
న్యూఢల్లీి,నవంబర్ 08 (ఆంధ్రపత్రిక):భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ మంగళవారం 95వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రధాని వెంట కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, రాజకీయ నాయకులు అద్వానీకు శుభాకాంక్షలు తెలియ జేసారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ 95వ జన్మదినం సందర్భంగా ఆయన నివాసానికి మోదీ, సింగ్ వెళ్లారు. ఆయనకు గులాబీపూల పుష్పగుచ్ఛాలను ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు.అద్వానీ నివాసంలో ఆయనతో పాటు మోదీ సుమారు 30 నిమిషాలపాటు ఆహ్లాదంగా గడిపారు. ఇరువురు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా లాల్ కృష్ణ అద్వానీ నుంచి ప్రధాని మోదీ ఆశీస్సులు తీసుకున్నారు. అద్వానీకి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం నవ్వుతూ కాసేపు ముచ్చటించారు. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని మోదీ ప్రతి సంవత్సరం ఆయన ఇంటికి వస్తుంటారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ట్వీట్ చేయడం ద్వారా అభినందనలు తెలిపారు. పూజించే లాల్ కృష్ణ అద్వానీ జీకి పుట్టినరోజు సందర్భంగా చాలా మంది శుభాకాంక్షలు. అతను భారత రాజకీయాలలో అత్యున్నత వ్యక్తులలో ఒకటిగా పరిగణించబడ్డాడు. దేశం, సమాజం పార్టీ అభివృద్ధి ప్రయాణంలో ఆయన చాలా ముఖ్యమైన కృషి చేశారు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుని కోరుకుంటున్నాను. అంతకుముందు వీరికి అద్వానీ కుమార్తె ప్రతిభ అద్వానీ స్వాగతం పలికారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన ట్వీట్లో, అద్వానీ తన జీవితాన్ని దేశానికి, సంస్థకు అంకితం చేశారని, అది తమకు ప్రేరణనిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ నిరంతర శ్రమతో దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేశారన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, దేశాభివృద్ధికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు.అద్వానీ 1927 నవంబరు 8న అవిభాజ్య భారత్‌లోని ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించారు. దేశ విభజన అనంతరం ఆయన కుటుంబం ముంబైకి వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. 2002 నుంచి 2004 మధ్య కాలంలో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అద్వానీ ఉప ప్రధాన మంత్రిగా పని చేశారు. గడచిన మూడు దశాబ్దాల్లో బీజేపీ ఎదుగుదల కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. లోక్‌సభలో ఇద్దరు సభ్యులు మాత్రమే ఉండే పరిస్థితి నుంచి 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీని తీర్చిదిద్దిన ఘనతలో ఆయన ప్రధాన భాగస్వామి. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న డిమాండ్‌తో ఆయన రథయాత్ర నిర్వహించారు. రాజస్థాన్‌లో రాష్టీయ్ర స్వయం సేవక్ సంఫ్‌ు కార్యకర్తగా పని చేశారు. ఆయన ఢల్లీి, గుజరాత్ల నుంచి ఎన్నికల్లో గెలిచారు. అద్వానీకి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి 2016లో మరణించారు. భారత ప్రభుత్వం ఆయనను 2015లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది. అద్వానీ తన 14వ ఏట రాష్టీయ్ర స్వయం సేవక్ సంఫ్‌ులో చేరారు. 1951లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఫ్‌ులో చేరారు. 1977లో జనతా పార్టీలో చేరారు. అద్వానీ బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు.. బీజేపీతో అద్వానీ భారత రాజకీయాల గమనాన్నే మార్చేశారు. ఆధునిక భారతదేశంలో హిందుత్వ రాజకీయాలతో అద్వానీ ప్రయోగాలు చేశారు. అతని ప్రయోగం చాలా విజయవంతమైంది. భారతీయ జనతా పార్టీ 1984లో 2 సీట్లతో ప్రయాణం ప్రారంభించి 2014లో సంపూర్ణ మెజారిటీని సాధించింది.ఆయన 1998 నుంచి 2004 వరకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో హోం వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. 2022 జూన్ నుంచి 2004 మేరకు భారత ఉప ప్రధానిగా సేవలు అందించారు. ఆయన 10వ లోక్‌సభ, 14వ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 1990లలో బీజేపీకి శక్తి కేంద్రంగా ఉన్నారు. 2009లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా అద్వానీ ఉన్నారు.. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోలేకపోయింది. 1990లో అద్వానీ రథయాత్రను ప్రారంభించారు. రామ మందిర నిర్మాణానికి మద్దతునిచ్చేందుకు అద్వానీ 25 సెప్టెంబర్ 1990న సోమనాథ్ నుండి రథయాత్ర ప్రారంభించారు. ఈ రథయాత్ర దేశ చరిత్రను మలుపుతిప్పింది. అద్వానీ తన ఉద్వేగభరితమైన, అద్భుతమైన ప్రసంగాల వల్ల హిందుత్వానికి హీరోగా మారారు.