విజయవాడ,నవంబర్8(ఆంధ్రపత్రిక): ప్రద్యుమ్న బాల్, ప్రగతివాది వేర్వేరు కాదని, రెండూ ఒకదానికొకటి పర్యాయపదాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ నాయకుడు, ప్రగతివాది దినపత్రిక వ్యవస్థాపకుడు ప్రద్యుమ్న బాల్ జయంతిని పురస్కరించుకుని గవర్నర్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఇక్కడి రాజ్‌భవన్ నుంచి భువనేశ్వర్‌లో నిర్వహించిన జయంతి వేడుకలలో దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. రాజ్ భవన్లో ప్రద్యుమ్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రద్యుమ్న బాల స్థాపించిన ప్రగతివాది దినపత్రిక సైతం 50వ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రద్యుమ్న నిర్భయ వక్త, గొప్ప వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకుడే కాక, సాహితీవేత్త, కాలమిస్ట్, సంపాదకుడు, సామాజిక కార్యకర్తగా విభిన్న పాత్రలను సమర్ధవంతంగా పోషించారని, ఎమర్జెన్సీ కాలంలో ప్రధాన భూమిక పోషించారన్నారు. తాము వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినవారైనా తమది ఒకే భావజాలమని, ప్రద్యుమ్న తన పత్రిక కథనాల ద్వారా ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపారని, కత్తి కంటే కలం గొప్పదని నిరూపించారని గవర్నర్ హరిచందన్ అన్నారు. భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి, అటాను సబ్యసాచి నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్ కుమార్ సాహూ, ప్రగతివాడి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బిరుపక్ష్యా త్రిపాఠి, విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా, సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!