- మహారాష్ట్రలో ప్రవేశించిన రాహుల్
- నాందేడ్ గురుద్వారాలో రాహుల్ పూజలు
- స్వాగతం పలికి ఆశిస్సులు అందించిన గురుద్వారా పెద్దలు
నాందేడ్/కామారెడ్డి,నవంబరు8(ఆంధ్రపత్రిక): కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన ’భారత్ జోడో యాత్ర’ తెలంగాణలో ముగిసి, మహారాష్ట్రలో ప్రవేశించింది. అక్కడి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురునానక్ ఆశీర్వాదాలతో భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. గురు నానక్ జయంతి సందర్భంగా గురుద్వారా యాద్గారి బాబా జోరవర్ సింగ్ జీ ఫతేప్ా సింగ్ జీ నుంచి ఆశీర్వాదాలు పొందారు. ఆయన గురునానక్ గురు పూరబ్ ఆర్దాస్ సమర్పించారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ట్వీట్లో, గురు ఆశీర్వాదాలతో పాదయాత్రను గురుద్వారా యాద్గారి బాబా జోరవర్ సింగ్ జీ ఫతేప్ా సింగ్ జీ నుంచి ప్రారంభించినట్లు తెలిపింది. రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్లో, మహారాష్ట్రలో భారత్‌జోడో యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. గురుపూరబ్ శుభ సందర్భంగా గురుద్వారా యాద్గారీ బాబా జోరవర్ సింగ్ జీ, ఫతేప్ా సింగ్ జీలో అర్దాస్ చేసినట్లు తెలిపారు. గురు నానక్ ప్రేమ, శాంతి, సోదర భావం నుంచి స్ఫూర్తిని పొందుతూ భారత దేశాన్ని ఏకం చేయాలనే సంకల్పాన్ని నెరవేరుస్తామన్నారు. ప్రజలందరికీ గురుపూరబ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ జోడో యాత్ర సోమవారం తెలంగాణా నుంచి మహారాష్ట్రలో ప్రవేశించింది. చివరిరోజు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో జోరుగా హుషారుగా సాగింది. ఆదివారం రాత్రి పెద్దకొడప్గల్లో బస చేసిన రాహుల్ సోమవారం ఉదయం 6.30 గంటలకు బిచ్కుంద మండలం పత్లాపూర్లో యాత్ర ప్రారంభించారు. రాహుల్‌తో జాతీయ, రాష్ట్ర, స్థానిక నాయకులు అడుగులో అడుగేస్తూ ముందుకు సాగారు. కందర్పల్లి, రాజుల్లా గేట్ విూదుగా తొమ్మది గంటల వరకు షేకాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపు వరకు సాగింది. సాయంత్రం వరకు జాతీయ, రాష్ట్ర నేతలతో సమావేశాలు నిర్వహించారు. నేతలు రావడంతో సందడిగా మారింది. సాయంత్రం 5 గంటలకు కళాకారులు ప్రదర్శనలతో తిరిగి యాత్ర సాగింది. అనంతరం మేనూర్ వద్ద బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. అనంతరం రాష్ట్ర సరిహద్దు మహరాష్ట్రలోకి జోడో యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా జోడో యాత్రకు తెలంగాణ నాయకులు, ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో యాత్ర ఇన్చార్జి జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్ అలీ, డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ శ్రీనివాస్‌రావు, భట్టి విక్రమార్క, వి. హనుమంతరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, శ్రీధార్ బాబు, జుక్కల్ నాయకులు గుడుగు గంగాధర్, గంగారాం స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్యం, ధన ప్రవాహంతోనే మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పారించాయన్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చిందన్నారు. ఢల్లీికో సుల్తాన్, తెలంగాణకో సుల్తాన్ ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. వీరిద్దరు కలిసి దేశాన్ని, రాష్టాన్న్రి నాషనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు అంటేనే ధనం అనే విధంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తయారు చేశాయన్నారు.