నవంబర్ 07 (ఆంధ్రపత్రిక): యంగ్ హీరో అడివిశేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ’మేజర్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అదే జోష్‌తో ’హిట్`2’ చిత్రాన్ని చేస్తున్నాడు. 2020లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ హిట్‌కు ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. ఇటీవలే రిలీజైన టీజర్ ఆసక్తిని రెట్టింపు చేసింది. ఎప్పుడె ప్పుడు సినిమా చూద్దామా అనే ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం మరో అప్డేట్ను ప్రకటించింది. ఈ చిత్రంలోని ’ఊరికే ఊరికే’ అంటూ సాగే మెలోడీ వీడియో సాంగ్‌ను నవంబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడిరచింది. ఎమ్.ఎమ్ శ్రీలేఖ ఈ చిత్రానికి సంగీతం అందించింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించింది. ఈ చిత్రంలో అడివిశేష్‌కు జోడీగా విూనాక్షీ చౌదరీ నటిస్తుంది. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని నిర్మిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!