జిల్లా కలెక్టర్ ఎస్ ఢల్లీిరావు
విజయవాడ,నవంబరు 5(ఆంధ్రపత్రిక):పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలను నివారించుకొని వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢల్లీిరావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి వైస్సార్ గ్రామ పంచాయితీలో జిల్లా పంచాయితీ అధికారి ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన దోమ తెరల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ ఢల్లీిరావు, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ ఫుడ్కర్ లు ముఖ్య అతిధులుగా హాజరై దోమ తెరలను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దోమల నివారణకు పరిసరాల పరిశుభ్రతే ప్రధాన మార్గమన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు క్రిమి కీటకాల ద్వారానే వ్యాపిస్తాయన్నారు.ప్రజలు వినియోగించి నిల్వ ఉన్న నీటి ద్వారా దోమలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందన్నారు. ఇంటిచుట్టూ పరిసరాల ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులలో చేరిన నీరు నిల్వ ఉంటాయని వాటిలో చేరిన దోమలు సంతాన ఉత్పత్తికి వినియోగించుకుని గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తిని చేసుకుంటాయన్నారు. పరిసరాలు ఎంత పరిశుభ్రతగా ఉంటే క్రిమి కీటకాల వ్యాప్తి అంత తక్కువగా ఉంటుందన్నారు. జక్కంపూడి జగనన్న కాలనిలో ప్రజలు జ్వరంతో బాధపడుతున్నారనే విషయం తమ దృష్టికి రావడంతో పంచాయితీ, మున్సిపల్ వైద్యారోగ్య రెవిన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి జ్వరాల వ్యాప్తికి కారణాలను అధ్యయనం చేయాలని ఆదేశించామన్నారు. వైద్య అధికారులు జక్కంపూడి కాలనిలో జ్వర పీడితుల నుండి రక్త నమూనాలను సేకరించగా మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించడం జరిగిందన్నారు. వేణు వెంటనే మున్సిపల్ అధికారులు కాలనిలో నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించి పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారన్నారు. దోమల నుండి రక్షణ పొందేందుకు దోమ తెరలను పంపిణీ చేయాలని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీని కోరడం జరిగిందన్నారు. 1000 దోమ తెరలను పంపిణీ చేసేందుకు ముందుకొచ్చిన రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సమరంను అభినందిస్తున్నామన్నా రు. పరిసరాల పరిశుభ్రతపై అవగహన పెంచుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఢల్లీిరావు తెలిపారు. స్వప్నిల్ దినకర్ ఫుడ్కర్ మాట్లాడుతూ నగరంలో విషజ్వరాలు ప్రబలకుండా అనుచర్యలు తీసుకుంటున్నామన్నారు.ముఖ్యంగా మురికి వాడలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంటింటికి ఫీవర్ సర్వేనిర్వహించి జ్వరాల భారిన పడిన వారిని గుర్తించి వారికీ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు మరో రెండు మూడు మాసాలు దోమలు ఎక్కు వగా ప్రబలే అవకాశం ఉందని పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోగాలపై ప్రతిఒక్కరు అవగహన కలిగి ఉండాలని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అందించిన దోమ తెరలను తప్పని సరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సమరం మాట్లాడుతూ దోమల నివారణకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజల సహ కారం కూడా అవసరం అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడు ముందుంటుందని జగనన్న కాలనీ వాసులకు 1000 దోమ తెరలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కోరడం జరిగిందన్నారు కాలనిలో ప్రతి ఇంటికి దోమ తెరలను పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. దోమ తెరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారిణీ జె.సునీత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణీ డాక్టర్ సుహాసిని, ఎంపిడివో భార్గవి, తసీల్ధార్ శ్రీనివాస్ నాయక్, ఉప ఎంపిపి వేమూరి సురేష్, జడ్పిటిసి సువర్ణ రాజు, ఎంపిటిసిలు సైదాభి, కల్పన సచివాలయ కార్యదర్శి భారతి తదితరులు పాల్గొన్నారు.