పట్నా,నవంబరు4:ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మండిపడ్డారు. వెనుక బడిన రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ‘’ఇప్పటివరకు పేద రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం చేసిందేమైనా ఉందా? అంటే అది కేవలం ప్రచారమే. అంతకుమించి ఇంకేం లేదు.’’అని నీతీశ్ వ్యాఖ్యానించారు. సీఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, విద్యాశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌధురితో కలిసి 200 మంది ఉర్దూ ట్రాన్సలేటర్లు, స్టెనోగ్రాఫర్లకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా మైనారిటీలు, దళితుల అభివృద్ధికి బిహార్ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తీరుతో బిహార్‌కు మొండిచేయే మిగులుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మతసామరస్యం పెంపొందేలా నితీశ్‌కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలను పార్టీ నాయకులు అభినందించారు. రాజకీయ కారణాలతో రెండు నెలల క్రితమే భాజపాతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీ-వామపక్షాలతో కూడిన మహాకూటమితో కలిసి నీతీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!