విజయవాడ,నవంబర్4(ఆంధ్రపత్రిక):పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువేనని ప్రతి క్షణం నమ్మి విద్యా రంగంలో ఎవరు ఊహించని విధంగా మార్పులు తెస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి సత్ఫలితాలు అందుతున్నాయి. విద్యా రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న అగ్రశ్రేణి రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ సగర్వంగా స్థానం సంపాదించుకుంది. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేనాటికి విద్యారంగంలో లెవల్-6లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ కృషితో రెండేళ్లకే ఏకంగా లెవల్-2కు చేరుకోవడం రాష్ట్రనీకే గర్వకారణం. విద్యా రంగంలో ఎన్నో రకాల పథకాలను తీసుకువచ్చి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయడం వల్ల స్కూళ్ల రూపురేఖలు మార్చటం దగ్గర నుంచి విద్యార్థుల పుస్తకాలు, భోజనం, స్కూలు బ్యాగులు, షూ, యూనిఫారాలు ఇలా అన్నింటిలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారిని ముందుకు నడిపిస్తున్న విధానం కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడిరగ్ ఇండెక్స్‌లో స్పస్టంగా కనవిపిస్తుంది. రాష్ట్రంలోనున్న కార్పొరేట్ స్కూళ్లలో సైతం కొన్నింటికి మాత్రమే అందుబాటులో ఉన్న ఎడ్యుటెక్ విద్యను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ, ద్విభాషా పాఠ్యపుస్తకాలను పరిచయం చేస్తూ తీసుకున్న చర్యలతో పాఠశాల విద్యలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2020-21గాను విద్యారంగంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కనబరిచిన పనితీరుకు సంబంధించిన ఫలితాల గ్రేడిరగ్ను (పీజీఐ) కేంద్ర విద్యా శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం విడుదల చేసింది. దీనిలో 2020-21 పెర్ఫార్మెన్సు గ్రేడిరగ్ ఇండెక్సులో ఆంధ్రప్రదేశ్ లెవెల్-2లో నిలిచింది. పెర్ఫార్మెన్సు గ్రేడిరగ్ ఇండెక్సును వివిధ అంశాల వారీగా 1000 పాయింట్లను ప్రామాణికంగా తీసుకొని కేంద్రం ఆయా రాష్ట్రాలకు లెవెల్ స్థాయిలను ప్రకటిస్తుంటుంది. ఇందులో 901 నుంచి 950 మధ్య పాయింట్లను సాధించిన రాష్ట్రాలు లెవెల్ 2లో నిలుస్తాయి. 2017-18, 2018-19 సంవత్సరాల్లో వరసగా లెవల్-6కు పరిమితమైన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని అగ్ర రాష్ట్రాల సరసన లెవల్-2లో నిలవటం గొప్ప విశేషం. ఏపీకి వివిధ అంశాల్లో వచ్చిన పాయింట్లు: ఆంధ్రప్రదేశ్‌కు లెర్నింగ్ అవుట్‌కమ్, క్వాలిటీలో 180గానూ 154 పాయింట్లు , విద్యార్థుల ఎన్రోల్మెంట్ రేషియో 80గానూ 77, మౌలికసదుపాయాల్లో 150గానూ 127, సమానత్వంలో 230కి గానూ 210, పాలన యాజమాన్యంలో 360కిగానూ 334 పాయింట్లు దక్కాయని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. దేశంలో విద్యారంగ ప్రమాణాల పెంపునకు వీలుగా పీజీఐ: 14.9 లక్షల పాఠశాలలు, వివిధ సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన సుమారు 26.5 కోట్ల విద్యార్థులు, 95 లక్షల మంది ఉపాధ్యాయులతో భారత విద్యా వ్యవస్థకు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యావ్యవస్థగా పేరుంది. విభిన్నమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులున్న మన దేశంలో విద్యా రంగంలో ఉన్నతమైన ప్రమాణాలు సాధించడం, అందరికీ ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి వీలైన ప్రణాళికలను రూపొందించడం వంటి లక్ష్యాలతో కేంద్రం ప్రతి ఏటా ఈ పెర్ఫార్మెన్సు గ్రేడిరగ్ ఇండెక్సులను ప్రకటిస్తోంది. దీనికోసం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని విద్యా రంగ పరిస్థితులను పరిశీలించి ఈ పీటీఐ స్థాయిలను నిర్ణయిస్తోంది. 1000 పాయింట్ల పీజీఐలో ఆయా రాష్ట్రాలు సాధించిన అభ్యసన ఫలితాలు, పాఠశాలల అందుబాటు, పాఠశాలల్లో ప్రాధమిక సదుపాయాల కల్పన, అందరికీ సమాన విద్య అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని పాయింట్లను కేటాయిస్తూ వీటి ఆధారంగా ఆయా రాష్ట్రాల లెవల్‌ను ప్రకటిస్తుంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!