మంచిర్యాల,నవంబర్4(ఆంధ్రపత్రిక):అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఓ 420 అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఒక్కో ఓటుకు వేల రూపాయలు ఇచ్చిన కేసీఆర్.. మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలిపారు. మునుగోడులో నల్లా తిప్పితే మంచినీళ్లకు బదులు లిక్కర్ వచ్చిందని ఆరోపించారు. సర్పంచ్ లు, ఎంపిటీసీలు, వార్డు నెంబర్లకు కార్లు, కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేస్తే తప్పులేదు. కానీ బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఆయనకు తప్పుగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర 3 వేల కిటోవిూటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టారు. సీఎం కేసీఆర్ రైతు ద్రోహి అని వైఎస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి.. రైతుబంధుతో కోటీశ్వరులు అయిపోతారా అని నిలదీశారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే నష్టపరిహారం రైతులకు అందడం లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో రైతు బీమా ఇవ్వడం లేదని విమర్శించారు. 8 ఏండ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో 800 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని షర్మిల స్పష్టంచేశారు. 8 ఏండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు.డిగ్రీలు, పీజీలు చదివినా ఉద్యోగాలు రావడం లేదన్నారు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే..అందులో 20 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వమంటే హమాలీ పని చేసుకోవాలని ఓ మంత్రి ఉచిత సలహా ఇవ్వడంపై మండిపడ్డారు. నిరుద్యోగంలో తెలంగాణ నెంబర్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిగులు బ్జడెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ. 4 లక్షల కోట్లు అప్పులు చేశారని షర్మిల ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సొమ్మును దోచుకున్నారని తెలిపారు. రూ. లక్షా 20 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 70 వేల కోట్లు దోచుకున్నారన్నారు. ఇంత అవినీతి సొమ్మును వెనకేసుకున్నా విపక్ష నేతలు ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. కేసీఆర్ అవినీతిపై ఢల్లీికి వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ ఒక్కటే అన్నారు. ఎక్కడ ముఖ్యమంత్రి అవినీతి బయట పడుతుందనే భయంతోనే రాష్ట్రంలోకి సీబీఐని రానివ్వకుండా రహస్యంగా జీవో తీసుకొచ్చారని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగాన్ని తెలంగాణలో మళ్లీ తేవాలన్న ఉద్దేశంతోనే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందని వైఎస్ విజయమ్మ అన్నారు. ఎంతో మంది పాదయాత్రకు అడ్డంకులు సృష్టించినా… యాత్ర ఆపాలని ఎన్నో కుట్రలు చేసినా.. షర్మిల తలవంచలేదు..తలదించలేదన్నారు. సంకల్పంతోనే పాదయాత్ర చేస్తూ… ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటోందని చెప్పారు. షర్మిల అంటే ఏమిటో.. ఆమె గుణం ఏమిటో ఈ యాత్ర ద్వారా తెలిసిందన్నారు. షర్మిల పరిణితి చెందినట్లు ఈ యాత్ర ద్వారా తనకు తెలిసిందని చెప్పారు. వైఎస్ షర్మిల పాదయాత్ర 3వేల కిలో విూటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడారు. ఏ ఆశయం కోసమైతే ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారో..ఆ ఆశ..ఆకాంక్ష నెరవేరలేదని వైఎస్ విజయమ్మ అన్నారు. మిగుల బ్జడెట్ రాష్టాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. ప్రభుత్వ తప్పులను షర్మిల పాదయాత్ర ద్వారా వెలికితీస్తోందన్నారు. సమస్యలను వెలికితీయడంతో పాటు..వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు. అంతేకాకుండా ప్రతిపక్షాలను తట్టిలేపుతూ..ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేస్తుందన్నారు. కాంగ్రెస్ జాఖీకి చేసిన మోసం… తెలంగాణకు బీజేపీ మోసంపై షర్మిల ప్రశ్నిస్తుందన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!