నందిగామ,నవంబర్4(ఆంధ్రపత్రిక):నందిగామలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబా బు రోడ్‌షోలో రాళ్ల దాడి చేశారు. చంద్రబాబు కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయి విసిరారు. ఈ దాడిలో ఈ దాడిలో చంద్రబాబు, చీఫ్ సెక్యూరిటీ అధికారి మధు గాయపడ్డారు. రాయి విసిరిన సమ యంలో విద్యుత్ సరఫరా నిలివేశారు. పోలీసుల భద్రతా వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు చంద్రబాబు రోడ్‌షోలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్‌షో తొందరగా ముగించాలంటూ టీడీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి తెచ్చారు. రోడ్‌షోకు భారీగా జనం తరలిరావడంతో అదనపు పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. చంద్రబాబు వాహనానికి ముందు, వెనుకా పెద్దఎత్తున రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వాహనం చుట్టూ అదనపు భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు. నందిగామలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోకు స్థానికులు, టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. చంద్రబాబుకు అడుగడుగునా పూలవర్షంతో స్వాగతం పలికారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!