మరికొంత సమయం పడుతుందన్న న్యాయమూర్తి
న్యూఢల్లీి, నవంబర్ (ఆంధ్రపత్రిక): అమరావతి రాజధాని పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అమరావతి కేసును పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి మరికొంత సమయం పడుతుంద ని న్యాయమూర్తి తెలిపారు. బెంచ్ కార్యకలాపాలు ముగియనుండటంతో రైతుల తరపు న్యాయవాది వికాస్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 14న మాత్రమే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే సోమవారమే విచారణ చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌రెడ్డి పట్టుబట్టారు. అంత అత్యవసరమని భావిస్తే మార్చి 3న హైకోర్టు తీర్పు ఇస్తే.. ప్రభుత్వం సెప్టెంబర్‌లో సుప్రీంకు ఎందుకు వచ్చిందని జస్టిస్ కేఎం జోసెఫ్ ప్రశ్నించారు. కేసుపై క్లుప్తంగా నోట్ ఇస్తానని రైతుల తరపు న్యాయవాది పాలి నారిమన్ కోర్టుకు తెలిపారు. దీనికి న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ అంగీకారం తెలిపారు.త్వరితగతిన విచారించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి తిరస్కరించిన సుప్రంకోర్టు.. తదుపరి విచారణను 14కు వాయిదా వేసింది.