కలెక్టర్ వేణుగోపాలరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
అమరావతి, నవంబరు 3(ఆంధ్రపత్రిక): ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 88వ వార్షిక సదస్సుల సందర్భంగా ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను గురువారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి ప్రారంభించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకూ వివిధ రకాల శాస్త్ర సాంకేతిక రంగ సమీక్షలు, సెమినార్లు జరుగనున్న నేపథ్యంలో ఆయా వార్తలను ఎప్పటికప్పుడు డెస్క్‌లకు చేరవేసేందుకు వీలుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మీడియా సెంటర్‌ను ప్రారంభించింది. ఈ నెల 6వ తేదీ వరకూ ఇది కొనసాగుతుందని వర్సిటీ కమ్యూనికేషన్ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ బల్వేరియా వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ కే ఆరోరా, ప్రో వైస్ ఛాన్సలర్ ఆచార్య నారాయణరావు, రిజిస్ట్రార్ ప్రేమక్కుమార్లు పాల్గొన్నారు.