ఆరిలోవ (విశాఖ), నవంబర్ 2 (ఆంధ్రపత్రిక) : ఆరిలోవ పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన, మార్కెట్ ధరకే కాయగూరలు అందించేందుకు రైతు బజారు అవసరం ఉందని, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె 2వ జోన్ ఆరిలోవ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్రక్కన ఉన్న అర ఎకరం ఖాళీ స్థలంలో రైతు బజారు నిర్మాణం కొరకు మార్కెట్ శాఖ వారి నిధులతో సుమారు 80 లక్షల వ్యయంతో తూర్పు నియోజకవర్గం అక్రమాన్ని విజయనిర్మల, మార్కెటింగ్ శాఖ చైర్మన్ అల్ప కృష్ణ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఆరిలోవ ప్రాంత ప్రజలకు రైతుల నుండి నేరుగా నాణ్యమైన తాజా కాయగూరలు అందించేందుకు 60 దుకాణాలు నిర్మాణం పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని, ఆరిలోవ ప్రాంత ప్రజలు సుదీర్ఘ ప్రాంతం వెళ్లి కాయగూరలు తెచ్చుకుంటున్నారని దీనివలన సమయం వృధా అవుతుందని అలాగే ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం నుంచి ఆరిలోవ ప్రాంత ప్రజలకు రైతు బజార్ కావాలని డిమాండ్ ఉందని, వారి చిరకాల వాంఛ నేటితో ఆ కల నెరవేరుతుందని ఈ రైతు బజార్ నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించి త్వరలో ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధించిన కాంట్రాక్టర్కు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించడం జరిగింది. దీనిపై ఆరిలోవ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున హర్షద్వాణాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మౌలిక వసతులే కల్పంగా ఆయా ప్రాంతాల ప్రజలకు ఏ అవసరమో అవి తీర్చడంలో ముందున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేస్తున్నారని తెలిపారు. అలాగే ఈ రైతు బజారు నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన జాయింట్ కలెక్టర్ కి నగర మేయర్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ యాసిన్, ఇంజనీర్ కెనడి, మాజీ మార్కెటింగ్ శాఖ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!