వైసిపి జిల్లా అధికార ప్రతినిధి… మళ్ళ బుల్లి బాబు
అనకాపల్లి, నవంబర్3( ఆంధ్ర పత్రిక): మండల కేంద్రమైన కసింకోట గ్రామానికి ఈనెల 5న రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమానికి రానున్నారని జిల్లా వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు అన్నారు. గురువారం స్థానిక వైసీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో బుల్లిబాబు మాట్లాడుతూ గ్రామంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు మంత్రి ఆమర్నాధ్ సహకారంతో చేపట్టడంతో జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమాన్ని గ్రామంలో కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు.కార్యక్రమంలో మండల వైసీపీ పెంటకోట జ్యోతి శ్రీనివాసరావు,పంచాయతీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.