డిసెబర్‌లో రెండు విడుతల్లో ఎన్నికలు
డిసెంబర్1,5న రెండు ఎన్నికలకు నిర్ణయం
డిసెంబర్ 8న ఫలితాల వెల్లడి
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడి
న్యూఢల్లీి,నవంబర్ 03 (ఆంధ్రపత్రిక): గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్రం ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ ఒకటో తేదీన తొలి దఫా, అయిదవ తేదీన రెండోదఫా ఎన్నికలను నిర్వహించ నున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలను వెల్లడిరచనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కవిూషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడుతలో 89 స్థానాలకు, రెండవ విడుతలో 93 స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు ఆయన వెల్లడిరచారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ సీఈసీ రాజీవ్ కుమార్ విూడియాతో మాట్లాడారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నారు. జనరల్ 142, ఎస్టీ 13, ఎస్సీ 27 స్థానాలు ఉన్నట్లు సీఈసీ వెల్లడిరచారు. 51,782 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 17506, రూరల్ ఏరియాలో 34276 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. 182 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,90,89765. దీంట్లో తొలిసారి 4,61,494 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాలు గెలుచుకున్నది. ఈ సారి కాంగ్రెస్, ఆప్, బీజేపీ మధ్య రసవత్తర పోరు తప్పదు. గుజరాత్ అసెంబ్లీ ఫిబ్రవరి 18, 2023లో ముగియనున్నది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు ప్రత్యేక అబ్జర్వర్‌ను ఏర్పాటు చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడిరచారు. మహిళలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. 4.90 కోట్ల మంది ఓటర్లలో పురుషులు 2.53 కోట్లు, మహిళలు 2.37 కోట్లు, మూడవ జెండర్‌కు చెందిన 1,417 మంది ఓటర్లు ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా నోటిఫికేషన్ ఈ నెల 5వతేదీన రిలీజ్ చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాలు గెలుచుకున్నది. ఈ సారి కాంగ్రెస్, ఆప్, బీజేపీ మధ్య రసవత్తర పోరు తప్పదు. గుజరాత్ అసెంబ్లీ ఫిబ్రవరి 18, 2023లో ముగియనున్నది.హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు ప్రత్యేక అబ్జర్వర్‌ను ఏర్పాటు చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడిరచారు. మహిళలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. 4.90 కోట్ల మంది ఓటర్లలో పురుషులు 2.53 కోట్లు, మహిళలు 2.37 కోట్లు, మూడవ జెండర్‌కు చెందిన 1,417 మంది ఓటర్లు ఉన్నారు.