ఢల్లీిలో కాలుష్యానికి చెక్ పెట్టాల్సిందే
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢల్లీి,నవంబర్ 03 (ఆంధ్రపత్రిక): గాలి కాలుష్యం భారత్కు పెద్ద సమస్య అని, దాన్ని తక్షణమే నివారించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఢల్లీి పొరుగు రాష్టాల్ల్రో రైతులు వరికోతల అనంతరం కొయ్యలు తగులబెడుతున్న తరుణంలో దేశ రాజధానిలో భారీగా కాలుష్యం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పర్యావరణం కోసం కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఇది ఓ పెద్ద సమస్య అన్నారు. క్లీన్ ఫ్యూయల్స్`2022పై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆయన.. ఢల్లీిలో గాలి నాణ్యత తగ్గుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.వరి పొట్టును బయో విటమిన్గా మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశంలో అనేక విజయవంతమైన ప్రాజెక్టులున్నాయని, వరిగడ్డితో బయో`సీఎన్జీ, బయో ఎల్ఎన్జీని తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా రంగాన్ని డీ కార్బనైజ్ చేసి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణాన్ని నిలకడగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇథనాల్, మిథనాల్, బయో సీఎన్జీ, బయో ఎల్ఎన్జీ, బయో డీజిల్, గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్ వంటి స్వచ్ఛమైన.. గ్రీన్ జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన ఇంధనం బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటుందన్న ఆయన.. చమురు దిగుమతి బిల్లులను తగ్గిస్తుంది, ఇంధన భద్రత, వాయు కాలుష్యం తగ్గుదలను నిర్దారిస్తుందని చెప్పారు.