- అయ్యన్నా అరెస్టే దీనికి పరాకాష్ట
- అర్ధరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేశారు
- విూడియా సమావేశంలో చంద్రబాబు ఆగ్రహం
అమరావతి,నవంబర్ 3 (ఆంధ్రపత్రిక): ఏపీలో అరాచకపాలన సాగుతోందని, దీనికి పరాకాష్ట మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్ట్ అని… టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ అరెస్ట్లు పరాకాష్టకు చేరుకున్నాయంటూ అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అక్రమమన్నారు. అర్ధరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేశారని, మద్యం మత్తులో వచ్చి దుర్మార్గంగా వ్యవహ రించారని… అయ్యన్న కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను చంద్రబాబు గుర్తు చేశారు.గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ… సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండ పిడ్డారు. వైసీపీ నేతల్లా అయ్యన్నపాత్రుడు అవినీతికి పాల్పడలేదని, భూకబ్జాలు చేయలేదని, బాబాయిని చంపించలేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు విశాఖలో వేలాది ఎకరాలను కబ్జా చేశారని ఆరో పించారు. విశాఖలో భూకబ్జాలపై పోరాడితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. వివేకా కేసులో పోలీసు లను ప్రభావితం చేశా రన్నారు. దొంగల్లా అర్ధరాత్రి ఇళ్లపైకి వెళ్లే అధికారం సీఐడీకి ఎవరి చ్చారని నిలదీ శారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదని.. ఖబడ్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరిం చారు. వైసీపీ నేతల అక్రమాలపై పోలీసుల చర్యలేవి అని నిలదీశారు. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరి స్తున్న.. పోలీసులపై చట్టపరంగా చర్యలకు వెళతామని చంద్రబాబు స్పష్టం చేశారు.వైసీపీ అవినీతి బయ టకు వస్తుందనే అయ్యన్నను అరెస్ట్ చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఐడీకి దమ్ముంటే విశాఖ భూకబ్జాదారులను అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టాలని చూస్తే.. మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ నేతల పైశాచిక ఆనందం కోసం కేసులు పెట్టి వేధిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, సీఐడీ తీరు స్టేట్ టెర్రరిజంలా ఉందన్నారు. తల్లికే జగన్ టికెట్ ఇవ్వలేదంటూ వివేకా హత్య కేసులో అవి నాష్రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐకి షర్మిల వాంగ్మూలం ఇచ్చారని ఈ సందర్బంగా చంద్రబాబు గుర్తు చేశారు. అక్రమ కేసులు పెట్టడంలో సీఎం జగన్, సీఐడీకి అవార్డులు ఇవ్వాలన్నారు. మమ్మల్ని శారీరకంగా హింసించినా.. మానసికంగా బలంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీఐడీ కార్యాలయం టార్చర్ ఆఫీస్గా మారిందని మండిపడ్డారు.