తాడేపల్లి,నవంబర్ 2 (ఆంధ్రపత్రిక): మనకు ఓటు వేయకపోయినా.. అర్హులకు మంచి చేశాం. అలాంటప్పుడు వాళ్లు మనల్ని ఎందుకు ఆదరించారు?. కచ్చితంగా ఆదరించి తీరతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.బుధవారం మండపేట కార్యకర్తలతో తాడేపల్లిలో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.మండపేట ప్రజలకు 946 కోట్ల రూపాయలను డీబిటీ(డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్జాక్షన్) ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా పనిచేశాం. గ్రామాల్లో వచ్చిన మార్పును మనం జనంలోకి తీసుకెళ్లాలి. ఒక మిషన్ ద్వారా దీన్ని జనంలోకి తీసుకెళ్లాలి. మండపేట నియోజకవర్గంలో 96,469 ఇళ్లకు గాను 92 శాతం ఇళ్లకు పథకాలు చేరాయి. ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే 92 శాతం మంచి పనులు చేయగలిగాము. ఆ మంచిని వివరిస్తూ గడపగడపకు వెళ్లేలా ప్లాన్ చేశాం. అలా వెళ్ళినప్పుడు అక్క చెల్లెమ్మలు మనకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటప్పుడు వచ్చే ఎన్నికలలో 175కు 175 సీట్లు ఎందుకు రావు?ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. అర్హత ఉంటే చాలు.. అందరికీ మేలు చేశాం. మనకు ఓటు వేయకపోయినా మంచి చేస్తే వారి మనసు కరుగుతుందని మేలు చేశాం. కలిసికట్టుగా అందరూ పనిచేసి ఎన్నికలలో పార్టీని గెలిపించాలి’ అని సీఎం జగన్ కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు.మిమ్నల్ని కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి కలిసి చాలారోజులైంది. కలిసినట్టు ఉంటుందన్నది ప్రధాన కారణమైతే… రెండోది మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్దం కావాల్సి ఉంది. 18 నెలలు అంటే చాలా దూరం ఉంది అనుకోవచ్చు. దానికి సంబందించి ఇప్పుడే ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలు పెట్టాలా ? అని అనుకోవచ్చు. 18 నెలలు ఉన్నప్పటికీ ఆ దిశగా మనం అడుగులు ఎందుకు వేయాలన్నది చెప్పడానికే మిమ్నల్ని రమ్మన్నాం.ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సర్వసహజంగా జరుగుతాయి. కానీ మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్ద ప్రతి 2వేల జనాభాకు 12 మంది అక్కడే కూర్చుని పనిచేసేటట్టుగా ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో అనుసంధానం చేసి, ప్రతి గడప, ప్రతి కుటుంబం కూడా అర్హత ఉండి రాని పరిస్థితులు ఉండకూడదని తాపత్రయపడుతున్నాం. పారదర్శకతతో అందరికీ అన్ని పథకాలు రావాలని ఎప్పుడూ జరగని విధంగా సాచ్యురేషన్ విధానంలో అడుగులు వేశాం.ఒక్క మండపేట నియోజకవర్గంలోనే రూ.946 కోట్లు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో కేవలం బటన్ నొక్కి ప్రతి ఇంటికి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. వైయస్సార్ పెన్షన్ కానుక, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా మొదలుకుని క్రాప్ ఇన్సూరెన్స్, చేయూత, విద్యాదీవెన వరకు రకరకాల పథకాలు డీబీటీ ద్వారా ఆధార్ కార్డు సహా ఎవరికి ఎంతిచ్చామో, ఎవరికి ఏ రకంగా మేలు జరిగిందన్నది ఆధారాలతో సహా పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హుడైన ఏ ఒక్కరు మిస్ కాకుండా దేవుడి దయతో అడుగులు వేయగలిగాం. ఇటువంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి మార్పు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇంత మార్పు జరుగుతున్నప్పుడు దాన్ని మనం ప్రజలదగ్గరకు తీసుకుని వెళ్లి…వారికి ఇవన్నీ గుర్తు చేసి.. ప్రజల ఆశీస్సులు మనం తీసుకుని అడుగులు ఇంకా ఎఫెక్టివ్‌గా వేసేదానికి మిమ్నల్ని భాగస్వామ్యులను చేస్తున్నాం.మొట్టమొదటిసారిగా గడప గడప అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే.. మన ఎమ్మెల్యే కానీ, మన ఎమ్మెల్యే అభ్యర్ధి కానీ… గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో సచివాలయ వ్యవస్ధ, మండల స్ధాయి అధికారులు, గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మమేకమై ప్రతి గడపనూ తట్టి, ప్రతి గడపలోనూ జరిగిన మంచిని వివరిస్తూ వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటూ మరోవైపు పొరపాటున ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే… అటువంటి వారు కూడా మిగిలిపోకూడదనే తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు డబ్బులు కూడా కేటాయించాం. ఆ సచివాలయానికి వెళ్లినప్పుడు ఆ సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. సచివాలయానికి రూ.20 లక్షలుఅంటే నియోజకవర్గానికి దాదాపు రూ.20 కోట్లు కేటాయించినట్లవుతుంది. ఆ సచివాలయంలో రెండు రోజుల పాటు ఉండాలి. ఒక్కోరోజు కనీసం 6 గంటలు ఆ సచివాలయంలో ఉండాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి.మీ నియోజకవర్గంలో 96,469 ఇళ్లు ఉన్నాయి. ఇందులో మన పథకాలు చేరిన ఇళ్లు 91.96 శాతం. అంటే సుమారు 92 శాతం ఇళ్లలో ఆ అక్కచెల్లెమ్మల పేర్లతో ఏ పథకం చేరింది, ఎన్ని పథకాలు చేరాయి అని ఏకంగా ఆథార్ కార్డు డీటైల్స్‌తో సహా చెప్పగలికే పరిస్థితుల్లో సహాయం చేయగలిగాం.గ్రామమే ఒక యూనిట్‌గా తీసుకుంటే ఆ గ్రామంలో 92 శాతం ఇళ్లకు.. ప్రతి ఇంట్లో మనం మంచి చేశామని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఆ జరిగిన మంచిని వివరిస్తూ మనం గడప, గడపకూ కార్యక్రమం చేస్తున్నప్పుడు అవునన్నా పథకాలు అందాయి అని చల్లని ఆశీస్సులు ఆ అక్కచెల్లెమ్మలు మనమీద చూపించినప్పుడు ఆగ్రామంలో మనం గెలుస్తాం.గ్రామం గెల్చినప్పుడు నియోజకవర్గం గెలుస్తాం. గ్రామం, నియోజకవర్గం గెల్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 కి 175 ఎందుకు రావు ?. ఒక్క మండపేట నియోజకవర్గంలో మండపేట మున్సిపాల్టీతో సహా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు లెక్క తీసుకుంటే.. మున్సిపాల్టీలో 30 కి 23 వైయస్సార్సీపీ, జడ్పీటీసీలు మూడిరటికి మూడు, ఎంపీపీలు మూడిరటికి మూడు ఏ లెక్కలు తీసుకున్నా గతంలో రానివి ఇప్పుడు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ అన్నీ క్లీన్‌స్వీప్ చేశాం. ప్రజల దీవెనలు మనవైపు కనిపిస్తున్నాయి. కారణం పాలన పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా లంచాలు అవసరం లేదు. వివక్ష చూపించడం లేదు. మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉండి రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే కచ్చితంగా వచ్చేటట్టు చేస్తాం. మనం చేసిన మంచిని చూసి మార్పు వస్తుంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!