విశాఖపట్నం,నవంబర్ 2 (ఆంధ్రపత్రిక): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 11, 12 తేదీలలో ప్రధాని నగరంలో పర్య టించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను జిల్లా అధికారులు, ఎంపీ విజయ సాయిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి మాట్లాడుతూ… 11, 12 తేదీల్లో ప్రధాన మంత్రి పర్యటన ఖరారైందని.. దీనిపై అధి కారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం పార్టీలకు సంబంధించింది కాదని ప్రభుత్వ కార్యక్రమమని స్పష్టం చేశారు. విస్తరణ ఉందని…రైల్వే జోన్‌కు సంబంధించి తెలియాల్సి ఉందని ఎంపీ విజయసాయి వెల్లడిరచారు.కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ… విశాఖలో ప్రధానమంత్రి పర్యటన ఖరారైందని తెలిపారు. ఈనెల 11న ప్రధానమంత్రి రానున్నారని.. 12న జరిగే సభలో పాల్గొంటారని చెప్పారు. రూ.10,475 కోట్లు విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మొత్తం ఏడు కార్యక్రమాలకు షెడ్యూల్ ఖరారైనట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, ఉత్తరాంధ్రలో పలు కేంద్ర ప్రభుత్వ రోడ్లకు శంకుస్థాపనలు ఉంటాయన్నారు. మైదానంలో సుమారుగా 65 వేల నుంచి లక్ష మంది జన సవిూకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!