- ట్రాక్టర్‌పై తెగిపడ్డ విద్యుత్ తీగలు
- విద్యుత్ ఘాతంతో నలుగురు మృతి ,ఇద్దరి పరిస్థితి విషమం .
- మృతుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేషియా
- ఆదేశించిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి
బొమ్మనహాళ్, నవంబర్ 2 (ఆంధ్రపత్రిక) : మండలం లోని దర్గా హొన్నూరు లో ఘోర విద్యుత్ ప్రమాదం సంభవించింది.కొన్ని కుటుంబాలలో మర్చిపోలేని విషాద ఛాయలను మిగిలించిన విద్యుత్ సంఘటనా. అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లారాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని బొమ్మనహాల్ మండలంలో తీవ్ర విషాదం దర్గా హో న్నూర్ గ్రామంలో విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు కూలీలు మృతిచెందారు.ఆముదం పంట పనులు ముగించుకొని ట్రాక్టర్లో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది ట్రాక్టర్‌పై 11 కె.వి విద్యుత్ తీగలు తెగి పడడంతో ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో బళ్లారి వీమ్స్ కు తరలించడం జరిగింది.మృతుల వివరాలు లక్ష్మి, వండ్రక్క, సరో జమ్మ, పార్వతి అక్కడికక్కడే మృతిచెందారు.మృతి చెందిన వారు దర్గాహొన్నూరు వాసులు.ఇంకా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు.