పథకాలన్నీ కొనసాగిస్తాడు, ఎమ్మెల్యే కన్నబాబు రాజు
అచ్యుతాపురం, నవంబర్ 1 (ఆంధ్రపత్రిక) : అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో, తిరిగి ముఖ్యమంత్రిగా జగన్ ను తీసుకురావడా నికి ప్రజలంతా కంకణం కట్టుకున్నారని ఎమ్మెల్యే కన్నబాబురాజు అన్నారు ఆవ సోమవారం గ్రామంలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిన జాబితాలను ఆయా ఇళ్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో డెంగీ వంటి సమస్య ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తగిన చర్యలు తీసుకొని గ్రామంలో మంచి ఆరోగ్య పరిస్థితి నెలకొనేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఉప్పలపాటి సుకుమార వర్మ, ఎంపీపీ కోన బుజ్జి, జడ్పిటిసి లాలం రాంబాబు,నర్మల కుమార్, సర్పంచ్ కోల అప్పలరాజు,కంఠం రెడ్డి శ్రీనివాసరావు, వైసీపీ మండల కన్వీనర్ దేశం శెట్టి శంకర్రావు, సర్పంచులు కే విమల నాయుడు, పిన్నమరాజు వాసు, ఆడారి గణపతి అచ్చయ్య నాయుడు కాండ్రేగుల జగన్ తదితరులు పాల్గొన్నారు