కంపాలా,అక్టోబర్ 25 (ఆంధ్రపత్రిక): ఉగాండాలోని ఓ అంధుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది అగ్నికి ఆహుతయ్యారు.ఇందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనకు గల కారణాలను మాత్రం అధికారులు వెల్లడిరచలేదు.ఉగాండా రాజధాని కంపాలాకు సమీపంలో సలామా అంధుల రెసిడెన్షియల్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి సమయంలో ఆ పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో కంటిచూపు లేని చిన్నారులు అగ్నిలోనే ఆహుతయ్యారు. మరికొందరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడిరచారు. ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఏడు నుంచి పదేళ్ల వయసు పిల్లలేనని.. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని స్థానిక జిల్లా అధికారి తెలిపారు. కుటుంబీకుల సహాయంతో డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామన్నారు.తూర్పు ఆఫ్రికా దేశమైన ఉగాండాలోని పాఠశాలల్లో ఇటీవల అగ్ని ప్రమాద ఘటనలు ఎక్కువైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కిక్కిరిసిపోయే తరగతి గదులు, హాస్టళ్లలో విద్యుత్ కనెక్షన్లు సరిగా లేకపోవడం వంటివి అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 2020లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో రెండు హాస్టళ్లు దగ్ధమయ్యాయి. 2008లో ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన హాస్టల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!