అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బివి.సత్యవతి
మునగపాక, అక్టోబర్ 24 (ఆంధ్రపత్రిక): స్వాతంత్య్ర సమరానికి అక్షరాయుధాలు అందించిన దినపత్రికగా ఆంధ్రపత్రిక రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమేనని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బివి సత్యవతి అన్నారు. తమ చాంబర్లో ఆంధ్రపత్రిక ప్రచురించిన పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం, దీపావళి ప్రత్యేక సంచికలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ, డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ, ఎంతో విలువలతో కూడిన ఆంధ్రపత్రిక ఇటువంటి ప్రత్యేక సంచిక లు తీసుకురావడం ద్వారా విలువైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తుందన్నారు. తాము చేసిన అభివృద్ధిని తెలియపరచడంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర పోషిస్తుందని ఆమె అభినందించారు. వాస్తవాలు వెలికి తీయడంలో ఆంధ్రపత్రిక కు మరే పత్రిక సాటిరాదన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేసే ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వం నుంచి సంక్షేమ, అభివృద్ధి పలాలు ప్రజలకు అందేలా చేయడంలోనూ చురుకైన పాత్ర పోషించాలని ఆ విధంగా ఆంధ్రపత్రిక ముందుం టుందని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రపత్రిక విలేఖరి కోయిలాడ జగన్నాథరావు, ఆంధ్రపత్రిక స్టాప్ రిపోర్టర్ ఎల్లపు వెంకటరమణాజీ, గణపర్తి సర్పంచ్ చదరం గణేష్ నాయుడు,జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు బుద్ధ రామ అప్పారావు, వైఎస్సార్సీపీ జిల్లా సేవాదళ్ కార్యదర్శి ఇరుబండి సత్యనారాయణ, కర్రి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.