అక్టోబర్ 25 (ఆంధ్రపత్రిక): సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన పేరువిూదున్న ఏఎంబీ సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్‌లలో ఒకటి. ఇక మహేశ్ కేవలం థియేటర్ బిజినెస్ మాత్రమే కాకుండా టెక్స్టైల్స్ బిజినెస్‌లోనూ అడుగుపెట్టారు. మహేశ్‌కు సంబంధించిన అన్ని వ్యాపారాలను ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ చూసుకుంటుంటారు. తాజా సమాచారం ప్రకారం.. మహేశ్‌బాబు హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. తన భార్య నమ్రత పేరుతో ఈ హోటల్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. మినర్వ గ్రూప్‌తో కలిసి మినర్వా `ఏఎన్ (ఏఎన్`ఏషియన్ నమ్రతా) పేరుతో బంజారాహిల్స్‌లో రెస్టారెంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్‌ఖ్తెనట్లు సమాచారం. త్వరలోనే ఈ బిజినెస్‌పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. మహేశ్ 28వ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్‌ఖ్తెంది. ఇటీవల తన తల్లి ఇందిరాదేవి మరణంతో మహేశ్ రెండో షెడ్యూల్‌కు కాస్త విరామం తీసుకున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్దే నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ విూద చినబాబు, నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!